యంగ్ డైరెక్టర్స్ కి రెండో సినిమా దెబ్బేసిందే

0

టాలీవుడ్ లో ఓ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ మొదటి సినిమాతో ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకొని రెండో సినిమాతో బోల్తా కొట్టారు. వారిద్దరు మరెవరో కాదు ఒకరు సుజిత్ మరొకరు రాహుల్ రవీంద్రన్. ‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి సత్తా చాటుకున్నాడు సుజిత్. ఆ సినిమా చూసే ప్రభాస్ పిలిచి మరీ తనను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు.

అలా ఇచ్చిన మాటకు కట్టుబడి ‘బాహుబలి’ తర్వాత సుజిత్ కి అవకాశం ఇచ్చాడు ప్రభాస్. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు కుర్ర దర్శకుడు. ‘బాహుబలి’ తర్వాత సినిమా కావడం భారీ బడ్జెట్ పెట్టడంతో ఒత్తిడికి లోనైయ్యాడు. అదంతా పక్కన పెడితే ‘సాహో’కి కంటెంట్ కూడా వీక్ అనిపించింది. అందుకే ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడికి అవకాశాల్లేవ్. మళ్లీ యూవీలోనే సినిమా అంటున్నారు కానీ దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక ‘చిలసౌ’తో దర్శకుడిగా అందరినీ సప్రయిజ్ చేసాడు రాహుల్ రవీంద్రన్. సుశాంత్ తో ఓ బ్యూటీఫుల్ కాన్సెప్ట్ తో సినిమా తీసి క్లిక్ అయ్యాడు. ఆ సినిమా చూసి నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అయితే రీమేక్ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేక పోయాడు రాహుల్. చీప్ కంటెంట్ తో ఓ డిజాస్టర్ సినిమా తీశాడంటూ విమర్శలు కూడా అందుకున్నాడు. ‘చిలసౌ’ తర్వాత ఇక తిరుగులేదనుకున్న అందరి ఆశలు అడి ఆశలు చేసాడు. ప్రస్తుతానికి రాహుల్ కి డైరెక్టర్ గా అవకాశాలు లేవు. మళ్లీ ఓ కాన్సెప్ట్ చిన్న సినిమా తీసి మెప్పిస్తే తప్ప రాహుల్ డైరెక్షన్ కెరీర్ కొనసాగదు. ఇలా ఇద్దరూ రెండో సినిమాతో దర్శకులుగా బోల్తా కొట్టి మూడు సినిమా అవకాశం అందుకోలేకపోతున్నారు.
Please Read Disclaimer