నారీ నారీ నడుమ బాలయ్య

0

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా సీనియర్ దర్శకులు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఆగస్టులో రెండో షెడ్యూల్ ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందే కథానాయికల్ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఇద్దరు యువనాయికల్ని ఎంపిక చేశారు. బాలయ్య సరసన లెజెండ్ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే వేదిక ఈ చిత్రంతో తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ఇద్దరు భామలు నటిస్తున్నారు అంటే నారీ నారీ నడుమ బాలయ్య రొమాన్స్ అదిరిపోతుందనే అభిమానులు భావిస్తున్నారు. ఇక బాలయ్య గత చిత్రాలన్నీ ఇద్దరు ముగ్గురు భామలతో స్పెషల్ ట్రీట్ ఇచ్చాయి. సమరసింహారెడ్డి- నరసింహారెడ్డి- సింహా- లెజెండ్- పైసా వసూల్ .. ఇవన్నీ భామలతో విజువల్ ట్రీటిచ్చాయి. మరోసారి బాలయ్య అలాంటి ట్రీట్ ని రెడీ చేస్తున్నారని భావించవచ్చు. సోనాల్ తో లెజెండ్ చిత్రంలో బాలయ్య కెమిస్ట్రీ గొప్పగానే కుదిరింది. ఇక నారా రోహిత్ సరసన బాణం చిత్రంలో నటించిన వేదిక అతడి సరసన నటిస్తుండడం ఇంట్రెస్టింగ్.

ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు మహానాయకుడు) ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ ఎంతో పట్టుదలగా నటిస్తున్న చిత్రమిది. `జైసింహా` తరహాలో మరో కమర్షియల్ సక్సెస్ ని బాలయ్యకు ఇచ్చేందుకు కేఎస్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer