స్టార్ యాంకర్ కంబ్యాక్.. అంత ఈజీనా?

0

సీనియర్లలో టాప్ రేంజ్ యాంకర్ల జాబితా తిరగేస్తే అందులో ఉదయభాను పేరు మస్ట్ గా ఉంటుంది. మాస్ లో మ్యాసివ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న పాపులర్ యాంకర్ కం నటిగా ఉదయభాను సుపరిచితం. డీసెంట్ గుడ్ గాళ్ తరహా యాంకరింగు రాజ్యమేలుతున్న టైమ్ లో బుల్లితెరను ఏలిన మాస్ యాంకర్ గా ఉదయభాను పేరు తెచ్చుకుంది. నాలుగు రోడ్ల కూడళ్లలోకి వెళ్లి విజిల్స్ వేస్తూ టిప్ టాప్ గా జీన్స్ టీషర్ట్ తో రకరకాల స్టోరీలు చేసిన ఉదయభాను అంటే యూత్ లో పిచ్చి క్రేజు ఉండేది. ముఖ్యంగా ఉదయభాను అందచందాలకు మాస్ యాంకరింగ్ స్టైల్ కి కుర్రకారు ఒళ్లు మరిచి మనసు పారేసుకునేవారు.

సరిగ్గా ఇదే పాయింట్ తను యాంకరింగ్ చేసిన షోలుకు చక్కని టీఆర్పీలు తెచ్చేది. ఫ్రీల్యాన్స్ యాంకర్ గా ఉదయభాను పలు సినిమా ఈవెంట్లు.. అవార్డ్ కార్యక్రమాలకు హోస్టింగ్ చేసి పెద్ద స్థాయికి ఎదిగారు. సుమ-ఝాన్సీ లాంటి టాప్ యాంకర్లు ఉన్నా ఉదయభాను తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరుచుకుని స్టార్ యాంకర్ గా ఎదిగారు. ఆ ఇద్దరినీ మించిన మాస్ ఫాలోవర్స్ ని తెచ్చుకోవడం హాట్ టాపిక్ అప్పట్లో.

అందుకే ఇప్పుడు ఈ యాంకర్ మరోసారి బుల్లితెర పై లక్ చెక్ చేసుకునేందుకు తిరిగి వస్తోంది అంటే ఆసక్తి నెలకొంది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు మామ్ అయ్యాక ఉదయభాను తిరిగి హోస్టింగుకు రెడీ అవుతోందట. ఈటీవీలో ఈ కార్యక్రమం టెలీకాస్ట్ కానుంది. అయితే భాను ఒకప్పుడు స్టార్ యాంకర్. ఇప్పుడు నవతరం ఏల్తోంది. అనసూయ-రేష్మి-శ్యామల- మంజూష అంటూ కొత్త యాంకర్లు దూసుకొచ్చి పాపులరైపోయారు. వీళ్లంతా అందానికి అందం ట్యాలెంటుతో బుల్లితెర షోల్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ పోటీ నడుమ ఉదయభాను కంబ్యాక్ అవుతుందా? ఎలా నెగ్గుకొస్తుంది చూడాలన్న ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది.
Please Read Disclaimer