ఆత్మహత్య చేసుకోవాలనుందంటున్న స్టార్ నటుడు

0

బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా తనయుడు ఉదయ్ చోప్రా హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈయన పలు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకులకు ‘ధూమ్’ చిత్రంతో పరిచయం అయ్యాడు. బాలీవుడ్ లో యశ్ చోప్రా తనదైన ముద్ర వేస్తే ఉదయ్ చోప్రా మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. చేసిన సినిమాలు సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ క్రెడిట్ వేరే వారికి వెళ్లడం సోలోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వంటి కారణాలతో ఉదయ్ చోప్రా కెరీర్ ఖతం అయ్యింది.

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఉదయ్ చోప్రా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఉదయ్ చోప్రా కొన్ని రోజుల క్రితం ఇండియాలో గంజాయిని అధికారికం చేయాలని మందు సిగరెట్ మాదిరిగా గంజాయిని కూడా అధికారికం చేయడం వల్ల మంచి జరుగుతుంది అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై ముంబయి పోలీసులు ఉదయ్ చోప్రాకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను తర్వాత కుటుంబ సభ్యులు తొలగించారు.

మరోసారి తాజాగా ఉదయ్ చోప్రా వింతగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను విపరీతమైన డిప్రెషన్ కు లోనవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎంత ప్రయత్నించినా కూడా దాని నుండి బయట పడలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరణంకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆత్మహత్యకు ఇది సరైన సమయంగా తాను భావిస్తున్నట్లుగా ట్వీట్ చేశాడు. ఉదయ్ చోప్రా ట్వీట్ చర్చనీయాంశం అవ్వడంతో వెంటనే ఆ ట్వీట్ ను కుటుంబ సభ్యులు డిలీట్ చేయడం జరిగింది. ఉదయ్ చోప్రా విషయంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer