UFOలో లోడవ్వలేదు.. నిర్మాత అవగాహనా రాహిత్యం

0

సినిమా తీస్తే సరిపోదు.. థియేటర్లు ఇస్తారో లేదో తెలియాలి. థియేటర్లు దొరికితే సరిపోదు. థియేటర్ లో ప్రొజెక్షన్ ఎలానో కూడా తెలియాలి. నిర్మాణం.. రిలీజ్ చేయడం.. డిజిటల్ టెక్నాలజీ .. పబ్లిసిటీ ఇలా ప్రతిదీ తెలిస్తేనే సినిమా సాఫీగా రిలీజవుతుంది. ఈమాత్రం తెలియని వాళ్లు టాలీవుడ్ లో నిర్మాతలు అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది.

సదరు నిర్మాత డిజిటల్ అవగాహనా రాహిత్యం .. చివరికి రిలీజ్ ఆగిపోయేలా చేసింది. పొద్దున్నే పడాల్సిన షో పడకుండా పోయింది. పైగా రెండ్రోజుల వరకూ డిజిటల్ అప్ డేషన్ చేయాల్సి ఉంది. అప్పుడే రిలీజ్ చేయగలం! అంటే అప్పటివరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఎప్పటిలానే ఈ శుక్రవారం ఐదారు సినిమాలు రిలీజ్ కి వస్తే అందులో ఒక నిర్మాత సన్నివేశం ఇదీ.. ఈ ఎపిసోడ్ లో ఏం అర్థమైంది? అంటే.. అసలు సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడమెలా? డిజిటల్ బేసిక్స్ ఏమిటి? అన్నది తెలియాలి నిర్మాతకు. లేదంటే గోల్ మాల్ గోవిందమేనని ప్రూవైంది.

వంద సినిమాలు తీసిన ఓ చిన్న నిర్మాత చెప్పిన సంగతిని చూస్తే.. కొత్త నిర్మాతలు దర్శకులు కి ఒక సలహా సినిమా తీయటం లో ఉన్న సరదా విడుదల ఎలా చేయాలి?.. అందుకు ఏమేమి చేయాలో కూడా తెలియాలి అంటూ క్లాస్ తీస్కున్నారు. అనేక కష్టాలు పడి మీరు సినిమా లు కంప్లీట్ చేస్తారు. విడుదల సమయానికి ఇంకా అనేక కష్టాలు ఉంటాయి డిస్ట్రిబ్యూషన్…థియేటర్స్… పబ్లిసిటీ.. వగైరా అన్ని తంటాటు చివరి నిమిషంలో ఉంటాయి. ఇవాళ విడుదల అవుతున్న ఒక సినిమాకి UFO.. SCRABBLE లో సినిమా లోడ్ చేయలేదు అని తెలిసింది. ఒక డిస్ట్రిబ్యూటర్ మిత్రుడు 2 థియేటర్స్ మాట్లాడి కన్ఫామ్ చేసి పబ్లిసిటీ కూడా చేసేశాడు. నిర్మాత కి ఫోన్ చేసి 2 థియేటర్స్ కి రేలీజ్ ఆర్డర్ ఇవ్వండి అంటే మాకు తెలియదు లోడ్ చేయలేదు అన్నాడట ఆ నిర్మాత.

అంతేకాదు.. ఈ రోజు UFO కి హడావుడి గా రూ.57000 కట్టారట ఇప్పుడు. దీంతో ఈ ఆలస్యానికి పరిహారం చెల్లింపుగా.. ఆదివారానికి కానీ రెడీ చేయలేం అన్నారట డిజిటల్ ప్రొవైడర్స్. దీనికి తోడు థియేటర్స్ వాళ్ళు ఆదివారం రిలీజ్ కి ఎలా ఇస్తాం? ఇలాంటివి చాలా ముందుగా చూసుకోవాలి కానీ అనేశారట. తెలుసు కొండి మిత్రమా!! ఇంకా సలహాలు కావాలంటే మన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శిని కానీ సంప్రదించండి. నిర్మాతల సెక్టార్ చైర్మన్ ని అడిగి లేదా కలిసి సరైన సలహాలు తీసుకోండి.. అంటూ బిగ్గానే క్లాస్ తీస్కున్నరు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. విసిరేయడానికి అని పంచ్ ఇచ్చారు. అయితే టాలీవుడ్ లో ఇలాంటి ఘటనలు అరుదు. చాలామంది నిర్మాతలు తెలుసుకునే విచ్చేస్తున్నారు. కానీ ఆ నిర్మాత బ్యాడ్ లక్.. ఏదీ తెలియకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.

యుఎఫ్ వో వంటి డిజిటల్ ప్రొవైడింగ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ కావడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్నిరోజుల ముందు వాటికి రెంట్లు కట్టాలి? వగైరా చాలా విషయాలు ముందే అవగాహన తెచ్చుకుంటేనే నిర్మాతలకు మంచిది. లేదంటే చివరి నిమిషం కష్టాలు ఇలానే ఉంటాయి. మొత్తానికి ఆయన అనుభవం కొందరికి గుణపాఠం అవుతుందన్నమాట.
Please Read Disclaimer