మాతో పెట్టుకుంటే చుక్కలే!

0

సెలబ్రిటీ టీనేజ్ గాళ్స్ స్నేహాల గురించి చెప్పాల్సిన పనేలేదు. స్కూల్ .. కాలేజ్ లో స్నేహం అటుపై కెరీర్ పరంగా ఎవరికి దారిన వారు వెళ్లడం ఇవన్నీ చూసేవే. బాలీవుడ్ లో ఓ ముగ్గురు టీనేజ్ గాళ్స్ స్నేహం గురించి ప్రస్తుతం ఆసక్తిగా ముచ్చటించుకుంటోంది వెబ్ ప్రపంచం.

బాలీవుడ్ యంగ్ గాళ్స్ అనన్య పాండే – సుహానాఖాన్- సనయా కపూర్… ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసే.. విడిగా కనిపించడం లేదు. నిను వీడని నీడను నేను అన్నట్టే ఉంది వ్యవహారం. ప్రస్తుతం ఈ సెలెబ్రిటీ వారసుల గురించి బాలీవుడ్ ఓ రేంజ్లో చర్చించుకుంటోంది. అనన్య పాండే ఇటీవలే కరణ్ జోహార్ నిర్మించిన `స్టెండ్ ఆఫ్ ది ఇయర్-2` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో అనన్యని నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. ఆ సమయంలో అనన్యకు అండగా నిలిచింది సుహానా ఖాన్ షనాయా కపూర్. ఈ ముగ్గురి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి సీక్రెట్స్ లేవట. అంత ఓపెన్గా వుంటారట.

ఇదే విషయాన్ని ఈ మధ్య అనన్యా పాండే బయటపెట్టేసింది. మేం ముగ్గురం ఏం చేసినా కలిసే చేస్తాం. కలిసే ఆ అనుభూతుల్ని పంచుకుంటాం. ఒకరికి కష్టం వస్తే మిగతా ఇద్దరం ఆ బాధని షేర్ చేసుకుంటాం. ఇక ట్రోలర్స్ గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ఎలా రియాక్ట్ అయినా మా ముగ్గురిలో ఎవరిపై రియాక్ట్ అయినా మిగతా ఇద్దరం ప్రొటెక్ట్ చేస్తూ ట్రోలర్స్కి కౌంటర్లు ఇస్తుంటాం. మాతో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తామనే సంకేతాల్ని ఇస్తుంటాం. ఒకరి వెంట ఒకరు అండగా వుంటూ కంటికి రెప్పలా వెన్నంటి వుండే నీడలా వ్యవహరిస్తుంటాం` అని అసలు విషయం బయటపెట్టేసింది. ఇక ఆ ఇద్దరిలో సుహానా కథానాయికగా పరిచయం కానుంది. సనాయా ఏం చేయబోతోందో తేలాల్సి ఉందింకా.
Please Read Disclaimer