నెట్ ఫ్లిక్స్‌లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’.. కంచరపాలెం దర్శకుడి మరో ముందడుగు

0

కేరాఫ్ కంచరపాలెం చిత్రం చూసిన తరువాత చాలామందితో ‘తెలుగు సినిమా ఎదుగుతోంది’ అని అనిపించాడు యువ దర్శకుడు వెంకటేష్ మహా. అంత అద్భుతంగా ఇండస్ట్రీకి ఆణిముత్యం లాంటి సినిమాను అందించారు ఈ దర్శకుడు. తొలి చిత్రంతోనే విమర్శకులతో ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా రెండో చిత్రమే ‘’. సత్యదేవ్ ఈ చిత్రంలో విలక్షణ పాత్రలో కనిపించబోతున్నారు.
శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఆర్కా మీడియా వ‌ర్క్స్ పతాకంపై.. మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి (కేరాఫ్ కంచరపాలెం నటి, నిర్మాత) సంయుక్తంగా ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన సూపర్ హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌.

ఫస్ట్ లుక్, టీజర్‌తో ఆట్టకున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదలకు రెడీ అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్స్‌లో బొమ్మ పడే పరిస్థితి లేనందున ఈ సినిమాను డైరెక్ట్.‌గా ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకానుంది. తాజాగా గురువారం నాడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకున్న ఈ మూవీ విజయం పట్ల చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఒకవైపు థియేటర్స్ తెరుచుకోలేని పరిస్థితితో పాటు.. నెట్ ఫ్లిక్స్‌తో మంచి డీల్ కుదరడంతో ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ అంటూ ఆన్ లైన్‌లో సందడి చేయబోతున్నాడు సత్యదేవ్.

మరో రెండు వారాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నా.. జనాలు గుమిగూడి థియేటర్స్‌కి వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారానే విడుదల చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు నిర్మాతలు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా కూడా ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పకనే చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
Please Read Disclaimer