అబ్రకదబ్ర.. బ్లాక్ అండ్ వైట్ మ్యాజిక్

0

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమధ్యే మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’ తో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ను ఏకకాలంలో కవర్ చేస్తూ తన కెరీర్ లో దూసుకుపోతోంది. ఈ భామ సోషల్ మీడియా లో సూపర్ యాక్టివ్. ఇన్స్టా ఖాతానే తీసుకుంటే పూజాకు 6.6 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వీరికోసమే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

ఆ రెగ్యులర్ అప్డేట్స్ లో భాగంగా పూజ తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. చూస్తుంటే ఇదో సెల్ఫీలా కనిపిస్తోంది. ఈ ఫోటోకు పూజ “బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో ఏదో మ్యాజిక్ ఉంటుంది.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో పూజ చెప్పిన మ్యాజిక్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఈ ఫోటోలో మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే.. క్లోజ్ అప్ ఫోటో… పైగా బటన్లు పెట్టుకోకుండా షర్టు వేసుకోవడంతో హాట్ గా కనిపిస్తోంది. ఆ అందాల విందుకు ఘాటు మసాలా జోడించినట్టుగా ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అసలే అందాల భామ.. అలాంటి పోజు ఇలాంటి ఎక్స్ ప్రెషన్ ఇస్తే ఎవరైనా మాయలో పడిపోవాల్సిందే.

అందుకే చాలామంది నెటిజన్లు పూజ మాయలో పడిపోయారు. “అబ్రకదబ్ర.. బ్లాక్ అండ్ వైట్ మ్యాజిక్”.. “నిజమైన మ్యాజిక్”.. “ఎక్స్ ప్రెషన్ తో చంపేస్తున్నావు”.. “హాట్ బేబీ ఆన్ ఫైర్” అంటూ కామెంట్లు పెట్టారు. పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా… రెండోది అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న AA19. ఇవి కాకుండా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer