విలేజ్ లో మామ అల్లుళ్ళు

0

2017లో వచ్చిన ‘జై లవ కుశ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వచ్చిన దర్శకుడు రవీంద్ర (బాబీ) వెంకటేష్ నాగ చైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కలిసి ఒకే సినిమాలో కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వెంకటేష్ ‘ఎఫ్ 2’ లాంటి సూపర్ హిట్ సినిమాతో జోష్ లో ఉన్నాడు. నాగ చైతన్య ‘మజిలీ’ లాంటి డీసెంట్ హిట్ తో ఫామ్ లో ఉన్నాడు. నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన వీళ్ళిద్దరూ సినిమాలో కూడా అలాగే కనిపిస్తున్నట్టు టైటిల్ చూస్తే అర్ధం అవుతుంది.

దసరా పండుగ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. అలాగే ఈ రోజు సినిమా కొత్త పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది సినిమా బృందం. ఈ పోస్టర్లో ఒక ట్రాక్టర్ మీద కూర్చుని ఉన్నారు వెంకీ చైతన్య రాశి ఖన్నా పాయల్. ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది ఇది విలేజ్ బేస్డ్ సినిమా అని. ఈ సినిమాకి సురేష్ బాబు విశ్వప్రసాద్ నిర్మాతలు.
Please Read Disclaimer