హీరోల్ని తయారు చేస్తున్న అంకుల్!

0

దీపం ఉండగానే చక్కదిద్దాలి! అన్నది ఫార్ములా. ఇండస్ట్రీలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఇది అనుసరణీయం అని చెబుతారు. హీరోలు- హీరోయిన్లు అయితే వెలుగు వెలుగుతున్నప్పుడే సంపాదించాలి. ఇక దర్శక నిర్మాతలు అయితే తమకంటూ కొందరు హీరోల బ్యాంక్ ని తయారు చేసుకోవాలి. ఒక హీరో లైమ్ లైట్ లో ఉండగానే ఇంకో హీరోని తయారు చేయాలి. హీరోలు ఎప్పుడూ నిర్మాతలకు బ్యాంక్ బ్యాలెన్స్ లాంటోళ్లు. అందుకే ఎంతమంది హీరోల్ని ఖాతాలో వేసుకుంటే అంతా బ్యాలెన్స్ ఫుల్ గా ఉన్నట్టే. ప్రస్తుతం ఈ ఫార్ములానే అనుసరిస్తున్నారట ఆ నిర్మాత.

కేవలం నాలుగైదు సినిమాలతోనే టాలీవుడ్ లో అసాధారణ పాపులారిటీ తెచ్చుకున్న హీరోతో వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న సదరు నిర్మాత.. ఆ హీరో సోదరుడిని కూడా హీరోగా తయారు చేయాలనుకున్నారు. వరసకి అంకుల్ కావడంతో తనే ఆ ఇద్దరికి సంబంధించిన రిస్క్ అంతా భరించేందుకు రెడీ అయ్యారు. అలా చేస్తే అన్నదమ్ములిద్దరూ తన ఖాతాలోనే వరుసగా సినిమాలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక ఇప్పటికే ఆ హీరో నైజాం మెగాస్టార్ అన్నంత పాపులారిటీ తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ఊపులోనే అతడి తమ్ముడిని కూడా హీరోగా పాపులర్ చేస్తే అది బిజినెస్ కి వర్కవుటవుతుందని భావించారట.

అయితే తానొకటి తలిస్తే అన్న చందంగా అన్నను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా తమ్ముడిని యాక్సెప్ట్ చేస్తారా? అన్నలో ఉన్నంత విజువల్ బ్రిలియన్సీ తమ్ముడిలో లేదని ఇప్పటికే నెటిజనుల్లో ట్రోల్స్ ఎదురయ్యాయి. కేవలం అన్న ఛరిష్మాతో తమ్ముడిని రుద్దేయాలనుకున్నా కంటెంట్ లేకపోతే తెలుగు ఆడియన్ నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అతడి సక్సెస్ పైనే అంతా ఆధారపడి ఉంది. త్వరలోనే అతడు నటించిన తొలి సినిమా రిలీజవుతోంది. జూలై 1న ప్రీరిలీజ్ కి స్టార్ డైరెక్టర్ నే దించుతున్నారు. మొత్తానికి తనపై వచ్చిన విమర్శలకు సదరు యువహీరో హిట్టు కొట్టి ధీటైన సమాధానం ఇస్తాడా? ఎన్నో హోప్స్ పెట్టుకున్న అంకుల్ కి సక్సెస్ ని గిఫ్టిస్తాడా? అంటూ ఫిలింనగర్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? అతడితో సినిమా తీస్తున్న అంకుల్ ఎవరో మీరే చెబుతారా?
Please Read Disclaimer