బాలయ్య 105కి మొత్తం మార్చేశారా

0

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ నిన్న ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారం అయిపోవడంతో ఇక సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ లాంఛనంగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించే చిత్రం ప్రారంభోత్సవం జరగనుంది. నిజానికి ఇది రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సింది. కానీ స్క్రిప్ట్ విషయంలో రేగిన కొన్ని అనుమనాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. కొన్ని సీన్స్ తీసినట్టుగా ఇంతకు ముందు టాక్ వచ్చింది కాని అది ఎంతవరకు నిజమో తెలియదు.

ఇదిలా ఉండగా ముందు అనుకున్న పొలిటికల్ బ్యాక్ స్టొరీని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తది ఎంచుకున్నట్టు సమాచారం. టిడిపి అధికారంలో వస్తుందన్న ధీమాతో ఫుల్ రాజకీయ మసాలాలతో రాసుకున్న స్క్రిప్ట్ ని ఇప్పుడు ఓటమి నేపధ్యంలో డ్రాప్ అయినట్టు తెలిసింది. ఇప్పుడు తెరకెక్కబోతున్న కొత్త కథ దర్శకుడు పరుచూరి మురళి ఇచ్చారట. ఈయన గతంలో బాలయ్యతో అధినాయకుడు తీశారు. ట్రిపుల్ రోల్ చేసిన బాలకృష్ణకు అది చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోపీచంద్ ఆంధ్రుడు తీసింది ఈయనే.

ఓ పవర్ ఫుల్ లైన్ తో కథను డెవలప్ చేయడంతో ఫైనల్ గా ఇది ఓకే అయ్యిందని తెలిసింది. విలన్ జగపతిబాబుతో సహా తారాగణం వాళ్ళే ఉంటారని కాకపోతే అసలు థీమ్ మాత్రం మార్చేశారని తెలిసింది. వచ్చే సంక్రాంతిని టార్గెట్ పెట్టుకుని ప్లాన్ చేసుకున్న ఈ మూవీకి రూలర్-క్రాంతి అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా ఒకటి ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. హీరొయిన్లుగా పాయల్ రాజ్ పుత్-మెహ్రీన్ల పేర్లు వినిపిస్తున్నాయి.