సూపర్ స్టార్ వారసుడు ఫ్యామిలీ ప్యాక్!

0

పాత్రల డిమాండ్ ను బట్టి ఆహార్యం లో మార్పులు సహజం. ఒక్కోసారి ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు శరీరాకృతిలో రకరకాల మార్పులు తీసుకొస్తుంటారు. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ `దంగల్`లో ఒకే పాత్రలో రెండు డిఫరెన్సెస్ చూపించాడు. సిక్స్ ప్యాక్ బాడీలో కుస్తీలు పట్టేవాడిగా..అలాగే గురువు పాత్రలో బాన పొట్టతో కనిపించారు. ఆరెండు పాత్రల్లో రూపురేఖల మార్పిడి అనేది నిజంగా ఓ సాహసం.. అద్భుతం అనే చెప్పాలి. ఓ పాత్ర కోసం అమీర్ ఎంతగా శ్రమించాడో దంగల్ చెప్పకనే చెప్పింది.

ఇలా పాత్ర అవసరాన్ని బట్టి శరీరాన్ని విల్లులా వంచడం…అవసరమైన చోట బొద్దుగా కనిపించడం అనేది నటులకు మాత్రమే చెల్లింది. ఆ విషయంలో ఈ డెడికేషన్.. కమిట్ మెంట్ ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది. తాజాగా మోహన్ లాల్ కుమారుడు ఉన్ని ముకుదన్ కూడా అలాంటి రేర్ ఫీట్ చేసాడు. ప్రస్తుతం మలయాళం లో `మెప్పాడియన్` అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఇందు లో పాత్ర డిమాండ్ మేరకు సిక్స్ ప్యాక్ బాడీనీ ఫ్యామిలీ ప్యాక్ లోకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైలర్ అవుతోంది.

మమాంగం సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు సడెన్ గా బరువెక్కిన దేహంతో… ఉబ్బెత్తిన పొట్ట తో..కరిగిపోయిన కండలతో నెటిజనులకు షాకిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన జనతా గ్యారేజ్ లో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కు రీల్ లైఫ్ లోనూ చిన్న కుమారుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే అనుష్క ప్రధాన పాత్ర పోషించిన భాగమతి సినిమాలో స్వీటీకి భర్త పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer