చిలక జోస్యం చెప్పేవాడి పొట్ట కొట్టొద్దు ప్లీజ్

0

రామచిలుక అందం గురించి వర్ణించాలా? ఆ దోర దొండ పండు ముక్కులోనే బోలెడంత అందం దాగి ఉంది. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో ఓ ఆసక్తికర పోస్ట్ ను పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఇలాంటి వన్యప్రాణుల సంరక్షణ కు చెర్రోపాసన నడుం కట్టిన సంగతి తెలిసిందే.

రామచిలుక ను పంజరం లో బంధిస్తే 5000 జరిమానా పడుతుందని ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని ఈ సందర్భంగా ఉపాసన హెచ్చరించారు. రామచిలుక ఎగరడానికి పుట్టింది కానీ మీరు జాతకాలు చెప్పించుకోడానికో.. మీకు వినోదాన్ని అందించడానికో కాదు. అందుకే పంజరంలోని రామచిలుక ను బయటకు వదిలేలా చూడండి. అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి అని ఆమె ఇన్ఫో అడిగారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇలా చిలక జోస్యం చెప్పుకుని బతికే వాళ్ల పొట్టపై కొట్టడం న్యాయమా? అంటూ కొందరు ఉపాసనను ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక చిలుకమ్మను మచ్చిక చేసుకుని జోస్యం చెబుతాం! అంటూ ఊళ్లలో తిరిగే వారి పేటెంట్ రైట్ పోయినట్టేనా? ఇక అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల చరణ్ – ఉపాసన జంట వన్య ప్రాణుల సంరక్షణకు సంబంధించిన పరిశోధనా శాలను తమ స్వగృహంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer