బిల్ గేట్స్ తో మెగా ఎంటర్ ప్రెన్యూర్

0

మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ గురించి తెలిసిందే. అపోలో లైఫ్-అపోలో ఫౌండేషన్ అధినేతగా అభిమానులకు నిరంతరం యూట్యూబ్ వేదికగా టచ్ లో ఉన్నారు. ఈ వేదికపై ఫిట్ నెస్ సలహాలు ఇస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో భర్త రామ్ చరణ్ కి సంబంధించిన వ్యవహారాలతో పాటు సినిమాల సంగతుల్ని ముచ్చటిస్తూ మెగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే లక్షల్లో అభిమానులు తనని అనుసరిస్తుండడం ఆసక్తికరం.

ఇక హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్ లో ఒకరిగా ఉపాసన గౌరవం అందుకుంటున్నారు. ఇంతకుముందు పలు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలు.. పారిశ్రామిక వేత్తల సమావేశాల్లో అద్భుతమైన స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపైనా ఉపాసన గౌరవం అందుకున్నారు. విలువలతో కూడుకున్న ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకై తన ప్రయత్నం యువతరంలో ప్రతిసారీ స్ఫూర్తిని నింపుతోంది.

తాజాగా ప్రపంచ ధనవంతుల్లోనే నంబర్ వన్ గా వెలుగొందిన ది గ్రేట్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు. తనకు ఈ అరుదైన అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా ఆ ఫ్యాన్ మూవ్ మెంట్ ఫోటోను ఉపాసన షేర్ చేశారు. ఈ విశ్వాన్ని.. ప్రజల్ని కాపాడుతున్న వారు నిజమైన స్ఫూర్తి! అంటూ థమ్సప్ సింబల్ ఈమోజీని షేర్ చేశారు. ఇండియన్ ఫిలాంథ్రపి ఇనిషియేటివ్ (ఐపీఐ) ద్వారా ఇలాంటి అవకాశం దక్కిందని అందుకు ధన్యవాదాలు తెలిపారు.