యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

పిల్ల‌ల్ని క‌న‌డం నా వ్య‌క్తిగ‌తం.. ఉపాస‌న ఆన్స‌ర్

0

మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసాన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులకు సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం…చరణ్ సినిమాలకు సంబంధించిన సంగతుల్ని రివీల్ చేయడం.. కుటుంబ విషయాల్ని వెల్లడించడం.. ఇలా సందర్భాన్ని బట్టి ఉపాసన సోషల్ మీడియాల్లో అందరికీ టచ్ లో ఉన్నారు. ఇక పుట్టినిల్లు…మెట్టినిల్లు గురించి ఎంతో బ్యాలెన్సింగ్ గా మాట్లాడుతారు. తమ కుటుంబ వ్యవహారాలపై అరుదుగానే స్పందిస్తుంటారు.

ఇక ఉపాసన కు పెళ్లయిన కొత్తలో అసలు సినిమా ఇండస్ట్రీ సంగతులేవీ తనకు తెలియవని ఆరంభం అసలు తనకు అర్థమయ్యేవి కావని కూడా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అందరు ఆడపిల్లల్లానే తన భర్త రామ్ చరణ్ కథానాయికలతో ఆడి పాడుతుంటే తనకు ఏదోలా ఉండేదని కూడా అన్నారు.

తాను ఫీలైనా కానీ తనకు ఇండస్ట్రీ గురించి ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పేందుకు తన అత్తమ్మ ఎంతో సాయపడేవారని తెలిపారు. రామ్ చరణ్ కూడా కథానాయికలతో యాక్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పేవారని వెల్లడించారు. తనకు నెమ్మదిగా సినీప్రపంచం అర్థమైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ ఉపాసన లేదా జూనియర్ రామ్ చరణ్ ఎప్పుడు వస్తారు? అంటూ యాంకర్ ప్రశ్నించగా ఉపాసన దానికి ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. పిల్లల్ని కనడం అన్నది తన వ్యక్తిగత విషయమని ఇదే ప్రశ్న ప్రతిసారీ ఎదురవుతోందని కూడా అన్నారు.

సమయం వచ్చినప్పుడు తామే వెల్లడిస్తామని .. ఇక తాను ఏం చెప్పినా మీడియా సెన్సేషన్ చేస్తుందని కూడా ఉపాసన నవ్వుతూ అన్నారు. అవును అని అన్నా.. లేదు అని అన్నా దానిని హెడ్ లైన్స్ లోకి తెచ్చి సెన్సేషన్ చేసేస్తారని సమయం వస్తే తామే ప్రతిదీ వెల్లడిస్తామని తెలిపారు.ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దీనికి ఇంకా ఏదీ చెప్పను అని కూడా ఉపాసన అన్నారు. రామ్ చరణ్ – ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో ఈ జంటకు పెళ్లయ్యింది.