స్మార్ట్ గోల్స్ అంటున్న ఉపాసన

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. చరణ్ కు సంబంధించిన అప్డేట్స్ షేర్ చెయ్యడమే కాదు. అపోలో హాస్పిటల్స్ వెల్ నెస్ విభాగం హెడ్ గా ఉపాసన తరచూ హెల్త్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. నూతన సంవత్సరం సందర్భంగా తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన ఉపాసన ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటోల ను షేర్ చేస్తూ ఉపాసన ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. “2020 సంవత్సరానికి నా గోల్ ఇదే. స్మార్ట్ గా పని చెయ్యాలి. స్మార్ట్ గా పార్టీ చేసుకోవాలి. విలువ ఉండే మనుషులను చుట్టూ ఉంచుకోండి” అంటూ భలే క్యాప్షన్ ఇచ్చారు. నిజమే.. వేస్ట్ గాళ్లని దగ్గరకు రానివ్వ కూడదు. వారి వల్ల మన లైఫ్ లో సంతోషం పోతుంది. వాళ్ల ఫ్రస్ట్రేషన్ మనకు అంటగట్టి వాళ్లతో పాటు మనల్ని కూడా ఏడిపిస్తారు. అందుకే వ్యక్తిత్వం.. విలువ ఉన్న మనుషులనే పక్కన ఉంచుకోవాలి. ఇంతకంటే బెస్ట్ గోల్ ఏముంటుంది చెప్పండి?

ఎంతైనా మెగా వదినమ్మ స్టైలే వేరు. క్లిష్టమైన ఫిలాసఫీ కూడా మూడు ముక్కల్లో చెప్పింది. ఇక ఫోటోల్లో ఉపాసనతో పాటుగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.. తదితరులు ఉన్నారు. ఉపాసన ఒక పర్పుల్ కలర్ పార్టీ గౌన్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు మంచు ఫ్యామిలీ డైనమిక్ లేడీ లక్ష్మి ఒక “దిస్ పిక్ నీడ్స్ టు గో అప్” అంటూ ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఇచ్చారు. మరి మీకు అర్థం అయినంత అర్థం చేసుకోండి.
Please Read Disclaimer