మామగారు నిజమైన గ్యాంగ్ లీడర్-ఉపాసన

0

తండ్రికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన తనయుడిపై ప్రశంసల వర్షం ఒకవైపు.. మామ సాధించిన విజయంపై కోడలు ప్రశంసలు ఇంకో వైపు. మామకు అంత గొప్ప కానుక ఇచ్చిన హబ్బీపైనా ఆ సతీమణి పొగడ్తలు వేరొక వైపు.. టుడే సైరా డే కాదు.. ఉపాసన డే. ఆ సంగతి మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ ట్విట్టర్ ని ఫాలో అయితే చాలు ఎవరైనా చెప్పొచ్చు.

ఇంతకుముందు భీమవరంలో మామగారి 250 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్ ని షేర్ చేసిన ఉపాసన వరుస ట్వీట్టలో మామను ఆకాశానికెత్తేసింది. ఓవైపు ఎస్.ఎస్.రాజమౌళి అంతటి దిగ్గజం సైరాను అందులో నటించిన చిరుని.. దర్శకనిర్మాతల్ని ఆకాశానికెత్తేస్తూ ప్రశంసలు కురిపించారు. సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా శుభాకాంక్షలతో చిరును ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు ఉపాసన రామ్ చరణ్ మామ చిరంజీవి సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

భీమవరం మెగా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన మెగాస్టార్ ని సిసలైన గ్యాంగ్ లీడర్ అంటూ పొగిడేశారు. “మెగాస్టార్ సాధించారు. అతడు నిజమైన గ్యాంగ్ లీడర్. సైరా నరసింహారెడ్డి చిత్రం తండ్రికి కొడుకు ఇచ్చిన అల్టిమేట్ గిఫ్ట్. మెగాస్టార్ కోడలిగా గర్విస్తున్నా… రామ్ చరణ్ భార్యగానూ గర్వంగా ఉంది“ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
Please Read Disclaimer