పోస్టర్లతో దీపావళి ధమాకా

0

దీపావళి ధమాకా అదిరిపోయింది. వరుసగా పోస్టర్లు.. టీజర్లు.. సింగిల్స్.. ట్రైలర్లతో మోతెక్కించారు. సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురములో-డిస్కో రాజా- వెంకీ మామ-రూలర్ వంటి పెద్ద సినిమాల పోస్టర్లు రిలీజయ్యాయి. అలాగే చిన్న సినిమాల్లో శ్రీవిష్ణు- తిప్పరామీసం… నందిత శ్వేత- అక్షర…. సాయి పల్లవి- అనుకోని అతిధి… కళ్యాణ్ దేవ్- సూపర్ మచ్చి… నాగశౌర్య – అశ్వథ్థామ తదితర మీడియం రేంజ్ చిత్రాల టైటిల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. కల్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేష్ణ తెరకెక్కిస్తున్న `ఎంతమంచి వాడవురా` .. సత్యదేవ్ – ఇషారెబ్బ జంటగా నటిస్తున్న`రాగల 24 గంటల్లో` చిత్రాల పోస్టర్లు రిలీజయ్యాయి. నిఖిల్ `అర్జున్ సురవరం దీపావళి అప్ డేట్ అందింది. `ఠాగూర్`మధు సమర్పణలో రాజ్ కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది.

మహేష్ మూవీ సరిలేరు నుంచి ఏకంగా మూడు స్పెషల్ పోస్టర్లు రివీలవ్వగా.. అల వైకుంఠపురములో చిత్రం నుంచి ఓ రెండు ఇంపార్టెంట్ పోస్టర్లు రివీలయ్యాయి. చిత్రంలోని కాస్టింగ్ ఎవరెవరు? అన్నది పోస్టర్లలో ఎలివేట్ చేశారు. అలాగే రాములో రాముల పాట మేకింగ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. వెంకీ మామ స్టిల్ లో నాగచైతన్య ఆర్మీ గెటప్ రివీలైంది. ఇక బాలయ్య రూలర్ గా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రాబోతున్నారని పోస్టర్ లో ఇంటెన్సిటీ తెలిపింది. అలాగే డిస్కో రాజాగా నటిస్తున్న రవితేజ మునుపటి కంటే యంగ్ లుక్ తో నభాతో గొడుగులో రొమాన్స్ చేస్తూ కనిపించాడు.

చిన్న సినిమాల్లో సాయిపల్లవి అనుకోని అతిధి టీజర్ ఉత్కంఠ పెంచింది. హారర్ థ్రిల్లర్ తో ఫిదా బ్యూటీ ట్రీటివ్వనుంది. సాయిపల్లవి- ఫహద్ ఫాసిల్- ప్రకాష్ రాజ్- అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం `అధిరన్`కి అనువాదమిది. శ్రీ విష్ణు రఫ్ లుక్ లో కనిపిస్తున్న `తిప్పర మీసం` నవంబర్ 8న విడుదల కానుంది. దీపావళి పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ – ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజేత నిరాశపరిచాక చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రానికి `సూపర్ మచ్చి` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఎంపిక చేశారు. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగశౌర్య అశ్వథ్థామ క్యూరియాసిటీ పెంచింది. మునుపటితో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడని అర్థమైంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. కొన్ని పోస్టర్లలో ఎందుకనో రిలీజ్ తేదీల్ని ప్రకటించలేదు. ఫలానా టైమ్ కి వస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయా సినిమాల రిలీజ్ తేదీల్లో మార్పు ఉందని అర్థమైంది.
Please Read Disclaimer