కుదుట పడుతున్న బాలు ఆరోగ్యం

0

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం గత రెండు వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. వైధ్యలు ప్రతి రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తనయుడు చరణ్ కూడా ఆరోగ్య విషయమై అప్ డేట్ ఇస్తూ వచ్చాడు. వారం రోజులుగా ఆయన రోగ్యం విషమంగానే ఉందంటూ చెబుతూ వచ్చిన వారు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. బాలు గారి ఆరోగ్యం కుదుట పడుతుందంటూ ఈసారి వారు అప్ డేట్ ఇచ్చారు.

రోజు మాదిరిగానే చరణ్ మాట్లాడుతూ.. నాన్నను కలిశాను ఆయన నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన నాతో ఏదో చెప్పేందుకు పెన్ను పట్టుకుని రాసేందుకు ప్రయత్నించారు. కాని పెన్ను పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆయన పాటలు వింటున్నారు పాటలు పాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ చరణ్ పేర్కొన్నాడు.

ఇక ఆసుపత్రి వర్గాల వారు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కూడా బాలు గారి ఆరోగ్యం కుదుట పడుతుందని ఆయన స్పందింస్తున్నాడు అంటూ పేర్కొన్నారు. వేలాది మంది ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది. మరింత త్వరగా ఆయన కోలుకుని మళ్లీ జనాల ముందుకు వచ్చి పాటలు పాడాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.