మెగా ప్రిన్స్ సినిమాలో `A` స్టార్

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై.. అమెరికాలో బాక్సింగ్ లో తర్ఫీదు పొందాడు. మెలితిరిగిన కండల తో పరిపుష్టంగా తయారైన వరుణ్.. అదిరిపోయే టెక్నిక్ తో ప్రత్యర్ధులపై పంచ్ లు ఎలా విసరాలి? అన్నదానిపై పూర్తి స్థాయిలో శిక్షణను పూర్తిచేసాడు. ఇక సినిమా సెట్స్ కు వెళ్లడమే ఆలస్యం. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త కుర్రాడిని డైరెక్టర్ గా పరిచేయం అవుతున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రను రంగంలోకి దింపాలని చర్చలు జరుపుతున్నాడుట.

స్క్రిప్ట్ పరంగా ఆ స్పెషల్ రోల్ కు ఉపేంద్ర అయితే పర్ పెక్ట్ గా యాప్ట్ అవుతాడని అంతన్ని సంప్రదించారట. అయితే ఉపేంద్ర ఇంకా అంగీకరించారా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. మరి ఆ రోల్ బాక్సర్ తో పోటీ పడటానికా? సన్నాఫ్ స్యత మూర్తి లో దేవరాజులాంటి రోల్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఉపేంద్ర కొన్నేళ్లగా కన్నడ సినిమాలకే పరిమితమయ్యారు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చినా నటించడం లేదు. ఆ మధ్య గురూజీ త్రివిక్రమ్ పట్టుబట్టి బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. అదీ త్రివిక్రమ్ బలవంతం వల్లనే ఆ పాత్ర చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత అలాంటి ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదు. తాజాగా మరోసారి మెగా హీరో తో నటించే ఛాన్స్ వచ్చింది. మరి ఎస్ చెబుతారా? నో చెబుతారా? అన్నది చూడాలి. కన్నడలో ఉపేంద్ర పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన హీరోగా తెలుగులో పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులు సంపాదించుకున్న స్టార్ ఉప్పీ.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-