గ్రీన్ ఛాలెంజ్ ని ఉప్పెనలా వాడారు!

0

పచ్చని మొక్క ఆక్సిజన్ పెంచుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగయ్యేలా చేస్తుంది. పచ్చదనం వల్ల ఓజోన్ కి చిల్లు పడదు. అందుకే గ్రీనరీని పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మహోద్యమానికి కృషి చేసేవాళ్లంతా దేవుళ్లు. దీనికి కేసీఆర్.. జగన్ వంటి ముఖ్యమంత్రులతో కలిసి ముందుకొస్తున్న సెలబ్రిటీలు ప్రత్యక్ష దైవాలు.

అంతా బాగానే ఉంది కానీ.. సూక్ష్మంలో మోక్షంలాగా.. దీనిని కూడా పబ్లిసిటీకి వాడుకుంటే దానిని ఏమనాలి? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని టాలీవుడ్ లో కొందరు తమ సినిమాల ప్రచారానికి వాడేస్తున్నారన్నది ఒక నివేదన. అందునా సుక్కూ అండ్ టీమ్ `ఉప్పెన` ప్రచారానికి భలేగా ఉపయోగించుకుంటున్నారు! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉప్పెన హీరోయిన్ గ్రీన్ ఛాలెంజ్ మొదలు.. ఈ సినిమాలో ఉన్న ప్రతి కీలకమైన సభ్యుడు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. వారిని ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమేగా. స్వామి కార్యంతో పాటు స్వకార్యం అంటే ఇదేనేమో అనేస్తున్నారు. ప్రతిసారీ ట్రెండ్ ని తెలివిగా క్యాష్ చేసుకోవడం కొందరికేనా మాక్కూడా తెలుసు అంటున్నారా? వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జంటగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైరస్ లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది.