ఈ పోజులో భామను చూస్తే.. ఆ వేడి తట్టుకోవడం కష్టమే!

0

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చూడగానే ఆకర్షించే అందం ఉన్న హీరోయిన్లలో ఊర్వశి రౌటేలా ముందు వరుసలో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాల వడ్డనతో గ్లామర్ షోతో ఎల్లప్పుడూ యువతకు కిక్కిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను తన ఫొటో షూట్లతో మైమరపిస్తోంది. ఇండియాలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన బ్యూటీలలో ఊర్వశి కూడా ఒకరు. కోట్లలో అభిమానులు కలిగిన ఈ భామ బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఊర్వశి మరోసారి తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాను హీటెక్కించింది. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఊర్వశి ‘హేట్ స్టోరీ 4’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమాలో ఆమె అందాల ప్రదర్శన బీ-టౌన్ ప్రేక్షకులలో చిచ్చు రేపింది. ఇక ఏ విషయంలో అయినా ఊర్వశికి క్లారిటీ ఎక్కువట. అయితే వెండితెర మీద అందాలు ఆరబోయందే సక్సెస్ కాలేరు అనే విషయం ఒప్పుకోదు.

అలాగని మనం ఉన్నదే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ షో చేయకుండా మడికట్టుకుని కూర్చుంటే కుదరదు కదా అంటోంది. కెరీర్ పరంగా ఎదగాలంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా యాక్ట్రెస్ కావాలనుకున్న వారు గ్లామర్ షో గురించి అభ్యంతరాలు పెట్టుకోకూడదు అని చెప్తుంది. అలా డిసైడ్ అయ్యాకే తను సినీ ఫిల్డ్ కు వచ్చానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ బికినీ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఊర్వశిని చూస్తే చచ్చినట్లు అతిలోక ఊర్వశి దిగి నేలమీదకు వచ్చిందేమో అనిపించేలా ఉంది అమ్మడి అందం. టు పీస్ ఆరంజ్ బికినీలో బీచ్ పక్కన ఇచ్చిన పోజు అబ్బబ్బబ్బా.. కుర్రకారుకి పిచ్చిక్కిస్తుంది అంతే. ఊర్వశి మేనిఛాయ.. మతిపోగోట్టే పర్ఫెక్ట్ ఒంపులు.. అబ్బో చెప్పుకుంటూ పోతే ఊర్వశి అందం గురించి పెద్ద గ్రంథమే రాయొచ్చు. ఈ బికినీ చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer