సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

చంద్రముఖి లా ధడ పుట్టిస్తోంది!

0

జ్యోతిక ప్రధాన పాత్రధారిగా వెటరన్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించిన `చంద్రముఖి`(1993) ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. జ్యోతిక మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ కి సౌత్ కనకవర్షం కురిపించింది. ఆ తర్వాత చంద్రముఖి సిరీస్ లో పలు చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే జ్యోతిక షో ముందు ఇంకేదీ నిలవలేకపోయాయి. రారా (పారాయ్…) పాటలో జ్యోతిక అసాధారణ క్లాసిక్ విన్యాసం.. రజనీ లకలకలక ఇప్పటికీ అభిమానుల కళ్లలో అలానే నిలిచి ఉన్నాయంటే ఎంతటి ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు.

జ్యోతిక విన్యాసాల్ని ఎన్నో స్టేజీలపైనా.. డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ ఎందరో కళాకారులు ప్రదర్శించారు. ఇక క్లాసిక్ డ్యాన్స్ లో రౌద్ర రసం.. వీర రసం.. ఇతరత్రా రసాల్ని పండించే కళాకారుల అభినివేశానికి అంతూ దరీ అన్నదే లేదు. ఇదంతా సరే కానీ.. ఇదిగో ఇక్కడ ఈ అమ్మడు అచ్చం చంద్రముఖి ని తలపించే విన్యాసంతో కట్టి పడేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సర్ ప్రైజ్ గెటప్ అభిమానులకు ఒక రకంగా షాకింగ్ అనే చెప్పాలి.

ఊర్వశి తన ఇమేజ్ కి పూర్తి విభిన్నమైన గెటప్ తో కనిపించి షాకిచ్చింది. ఊర్వశి అంటేనే హాట్ బాంబర్. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని కొట్టే వాళ్లే లేరు. హేట్ స్టోరి 4లో బ్రదర్స్ తో రొమాన్స్ చేసే బ్యూటీ గా అదరగొట్టింది. అందుకే ఆ సీన్ ని ఊహించుకున్న అభిమానులకు ఇది మింగుడు పడని గెటప్. ఆర్టిస్టు అంటేనే సకలకళల్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకే ఊర్వశి చంద్రముఖిలా మారిందన్నమాట. ఆ కాటుక కళ్లతో భయ పెట్టేస్తున్నా..ప్రేమ.. కరుణ- ఆర్థ్రత అనేవి ఆ ముఖ కవళికల్లో పలికించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇటీవలే పాగల్ పంతి అనే చిత్రంలో నటించింది. త్వరలోనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది.
Please Read Disclaimer