లోపలి మోడల్ ను బైటకు తీసిందే!

0

అందాలనేవి ఆదిమ మానవుల కాలం నుండి ఇప్పటివరకూ ఉన్నాయి. అప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి. కానీ వాటిని గుర్తించాలంటే మాత్రం కావాల్సింది ఒక అందమైన మనసు. అది ఉంటే చాలు.. చాలా విషయాలు ఆటోమేటిక్ గా అందంగా కనిపిస్తాయి. అయితే అవన్నీ ఒక తీరు. కానీ మనకు అందమైన మనసులేకపోయినా సరే ఊర్వశి రౌతేలా లాంటి భామలైతే అందంగా కనిపిస్తారు.

ఇంతకీ ఊర్వశి ఎవరంటారా? టాప్ మోడల్ కమ్ బాలీవుడ్ భామ. మిస్ దివా-2015 గా ఎంపికయిన ఈ భామ అప్పట్లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. బాలీవుడ్ లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’.. ‘సనమ్ రే’.. ‘గ్రేట్ గ్రాండ్ మస్తి’.. ‘హేట్ స్టొరీ 4’ లాంటి సినిమాల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హాట్ మోడల్ కావడంతో ఘాటు ఫోటో షూట్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ సోషల్ మీడియా ఫాలోయర్లను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దిశా పటాని టైపులో ఇన్నర్ వేసుకుంది.. దానిపై ఒక పారదర్శకమైన బ్లాక్ షర్ట్ వేసుకుంది. అది వేసుకున్నా ఒకటే.. వేసుకోకపోయినా ఒకటే. ఎందుకంటే అందాల ప్రదర్శనకు అదేమీ అడ్డు కాలేదు. పఫ్ లాగా చేసిన హెయిర్ స్టైల్.. పెద్ద సైజ్ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ తో రాంప్ వాక్ చేసే మోడల్ తరహాలో ఉంది.

ఈ ఫోటోకు ఊర్వశి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. అయినా మన పిచ్చికానీ ఊర్వశి క్యాప్షన్ ఇవ్వకపోతేనేం. లక్షల కొద్దీ నెటిజనులు ఉన్నారుగా.. వారు క్యాప్షన్ లతో కామెంట్లతో రెచ్చిపోయారు. జస్ట్ రెండు గంటల్లో నాలుగు లక్షల లైక్స్ కొట్టారు. ఆరువేల కామెంట్లు వచ్చాయి. “ఐ వానా ఫాలో ఫాలో యు”.. “ఒక్కముక్కలో చెప్పాలంటే నువ్వు నిప్పు”.. “యూనివర్సల్ బ్యూటీ”..”ఊర్వశి ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి” అంటూ కామెంట్లు పెట్టారు. ఊర్వశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఊర్వశి ప్రస్తుతం ‘పాగల్ పంటి’ అనే సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer