తను కదలకుండానే కుర్ర గుండెలను పరిగెత్తిస్తున్న ఊర్వశి..!!

0

సినిమా ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్లకు.. వారి అందాలను దాచుకోని భామలు బాగానే ఉన్నారు. అందులో ఒకరు ఊర్వశి రౌతేలా. అందాన్ని ఆస్వాదించే వారికి ఊర్వశి ఎల్లప్పుడూ ఈ రంగుల ప్రపంచంలో అందగత్తె. ఇది కరోనా కాలం అయినా.. లాక్ డౌన్ ముగిసినా కుర్రకారు అందమైన భామలను సోషల్ మీడియాలో ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు. అలా అందాలను వెతికే వారికోసమే ఈ అమ్మడు పుట్టింది. ఈ బాలీవుడ్ భామ ఎన్నో అందాల పోటీల్లో విజేతగా నిలిచి మోడలింగ్ లో రాణించి.. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యేక పాటలకు స్పెషల్ క్యారెక్టర్లకే పరిమితమవుతూ వస్తుంది.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో రెండు కోట్లకు పైనే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఊర్వశి వారందరికీ ఫేవరేట్ యాక్ట్రెస్. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా తాజా ఫోటో షూట్లతో ఫొటోలతో నెట్టింట వైరల్ అవుతోంది. ఊర్వశి అందాలకు అభిమానులు నిద్ర కూడా పోవట్లేదట. ఇక తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. జిమ్ డ్రెస్ లో ఊర్వశి బాస్కెట్ బాల్ చేతబట్టి అభిమానుల మతులు పోగొడుతుంది. తను కదలకుండా కూర్చొని తన పోజుతో కుర్ర గుండెలను పరిగెత్తిస్తుంది. ఇంత అందాన్ని చూసాక కొంటె కుర్రాళ్లు ఆగుతారా తమదైన స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే ఊర్వశి గోపీచంద్ సీటిమార్ సినిమాలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. చూడాలి మరి ఊర్వశిని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..!