`వర్జిన్ భానుప్రియ` ఓటీటీ ట్రీట్ ఎపుడు?

0

వెండి తెరపై వేడెక్కించే పాత్రలతో ఊర్వశి రౌతేలా ట్రీట్ గురించి తెలిసిందే. అంతకుమించి సోషల్ మీడియాల్లో గ్లామరస్ ట్రీటివ్వడం ఈ అమ్మడికే చెల్లింది. తాజాగా అంతకు డబుల్ ట్రీట్ రెడీ చేస్తోంది ఈ అమ్మడు. ఊర్వశి రౌతేలా నటించిన `వర్జిన్ భానుప్రియ` త్వరలో విడుదల కానుంది. హాలీవుడ్ స్టార్ ఎమ్మా స్టోన్ చిత్రం `ఈజీ ఎ` స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.`ఈజీ ఎ` అనేది 2010 అమెరికన్ కామెడీ చిత్రం. ఆలివ్ (కథానాయిక) గురించి.. తన బెస్ట్ ఫ్రెండ్ కు కాలేజీ బోయ్ వల్ల తన కన్యత్వాన్ని కోల్పోయానని అబద్ధం చెబుతుంది. వేరొక అమ్మాయి రహస్యంగా వారి సంభాషణను వింటుంది. ఆ తర్వాత కథ ఏమిటి? అన్నదే ట్విస్టు. ఆద్యంతం లవ్ రొమాన్స్ థ్రిల్ నేపథ్యంలో రక్తి కట్టించే చిత్రమిది. అందుకే హిందీ వెర్షన్ కి `వర్జిన్ భానుప్రియ` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని నిర్ణయించారు. వాస్తవానికి పెద్ద తెర రిలీజ్ కోసమే తెరకెక్కించినా మహమ్మారీ కారణం గా జూలై 16 న నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు.తన చిత్రం గురించి ఉర్వశి మాట్లాడుతూ “ది కామెడీ డ్రామా. ప్రస్తుత యువత కు పూర్తిగా కనెక్టయ్యే చిత్రమిది. ఇది ఫ్యామిలీ మెచ్చే కామెడీ చిత్రం. కుటుంబం .. యువత మధ్య సంబందబాంధవ్యాల్ని అన్వేషించేదిగా ఉంటుంది. ఎమ్మా స్టోన్ ఈజీ ఎ నుండి ప్రేరణ పొంది తెరకెక్కించారా? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. కానీ నేను దానిని పూర్తిగా వారి ఊహలకే వదిలివేస్తాను. నేరుగా వారు సినిమా చూసి కథను తెలుసుకుంటారు. లేజీకి వెళ్ళే అమ్మాయిలా పూర్తి యవ్వనం గా తెరపై కనిపిస్తాను“ అని తెలిపింది.

“అర్చన పురాన్ సింగ్ ఈ చిత్రం లో ఆమె నా తల్లిగా నటించారు. గౌతమ్ గులాటి నటించారు. ఇంట్లో ఉండి ట్రైలర్ విడుదల చేసిన నా మొదటి చిత్రం ఇది. ప్రపంచం నలు మూలల నుండి చాలా మంది అభిమానులు ప్రశ్నించారు. సినిమాలో నా పాత్ర .. కథ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు“ అని ఆమె అన్నారు.