యువి చేతికి నైజాం సైరా!

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. తాజా అప్ డేట్ ప్రకారం సైరా నైజాం హక్కులను యువి బ్యానర్ సాహో నిర్మాతలు సుమారు 30 కోట్లకు కొన్నట్టుగా తెలిసింది. ఇది చిరు మార్కెట్ పరంగా చూసుకుంటే చాలా క్రేజీ డీల్. పెట్టుబడి సేఫ్ కావాలి అంటే అంతే మొత్తంలో మినిమం షేర్ రాబట్టాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమంత కష్టం కాదు.

ఇప్పటికే సాహో కోసం భారీ మొత్తాలని ఇన్వెస్ట్ చేసిన యువి ఇప్పుడు ఇతర సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం సైతం రిస్క్ కు రెడీ కావడం విశేషం. ఇప్పుడీ నైజాం డీల్ అఫీషియల్ గా ప్రకటించింది కాదు కాని ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సైరా మీద నమ్మకంతోనే చరణ్ రేట్ కు ఓకే చెప్పినట్టుగా వినికిడి. ఇతర ప్రాంతాల నుంచి కూడా సైరాకు ఇదే తరహా డిమాండ్ వస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో సాహో కన్నా ఓ కోటి ఎక్కువగానే పలికినట్టు న్యూస్ వచ్చాయి కాని ఇంకా ధృవీకరణ కాలేదు.

సీడెడ్ ఆంధ్ర నుంచి సైతం మంచి ఆఫర్స్ కు సైరాను అడుగుతున్నారు. వీటిని ఒక పక్క క్లోజ్ చేసే పనిలో ఉంటూనే ప్రమోషన్ ని ప్లాన్ చేసుకుంటోంది సైరా టీం. చేతిలో ఉన్నది కేవలం 33 రోజులే. ఆడియో విడుదలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ లాంటి చాలా ప్రోగ్రాంస్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి అండ్ టీం మీడియా ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఎల్లుండి రాబోతున్న సాహో వేడి చల్లారడం ఆలస్యం టాలీవుడ్ కు జోష్ ఇచ్చేందుకు సైరా రంగంలోకి దిగేస్తాడు.
Please Read Disclaimer