ఫ్యాన్స్ ను మళ్ళీ ఇర్రిటేట్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్

0

ఏ హీరో అభిమానులైనా తమ హీరో అప్ కమింగ్ సినిమా గురించి ఎప్పుడూ ఏదో అప్ డేట్ వస్తుండాలనే కోరుకుంటారు. సినిమాకి ప్రమోషన్ ప్లాన్స్ ఎలా ఉన్నా వారికి ఎప్పటికప్పుడు ఓ అప్ డేట్ ఇస్తుండాల్సిందే. లేదంటే వారి కోపానికి ఆ ప్రొడక్షన్ హౌజ్ బలవ్వక తప్పదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ను తప్పుపట్టలేం. ఎందుకంటే సినిమా రిజల్ట్ ఏదైనా మొదటి రోజు థియేటర్స్ ఫుల్ చేసేది వాళ్ళే కాబట్టి.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ విషయంలో అదే జరుగుతుంది. ‘బాహుబలి2 ‘తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ అప్ డేట్స్ విషయంలో యూ.వి.క్రియేషన్స్ నిర్మాత లపై ఓ సందర్భంలో గట్టిగా కోప్పడ్డారు రెబెల్ ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ప్రొడక్షన్స్ హౌజ్ ని ట్యాగ్ చేసి పోస్టులతో నానా రచ్చ చేసారు. ఓ టైంలో ఫ్యాన్స్ నుండి వస్తున్న ఒత్తిడిను నిర్మాతలు తట్టుకోలేకపోయారు కూడా.

సరిగ్గా ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ‘జాన్’ సినిమా ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టిన రోజున ఉంటుందా..? లేదా ? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నిర్మాతలను నిలదీస్తున్నారు. ఇంత వరకూ సినిమా టైటిల్ పై కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు. మరి యూ.వి.నిర్మాతలు ‘సాహో’ లా కాకుండా ‘జాన్’ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే బెటర్. లేదంటే రెబల్ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు.
Please Read Disclaimer