మెగా మేనేజర్ పై ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆరోపణ

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా `సైరా- నరసింహారెడ్డి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టాకీ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈలోగానే ఉయ్యాలవాడ వంశానికి చెందిన పలువురు ఫ్యామిలీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆందోళనకు దిగడం చర్చకొచ్చింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో `సైరా` సినిమా ప్రారంభానికి ముందు రామ్ చరణ్ సహా యూనిట్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. ఈ కథను వేరొకరు తీయకుండా మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ సొంత బిడ్డలా మాట్లాడారు. నాతో గంటసేపు మాట్లాడారు. మా కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. అంతేకాదు షూటింగ్ కోసం మా ఇంటిని ప్రాపర్టీలను వాడుకున్నారు. కానీ నిన్న చరణ్ మేనేజర్ ఫోన్ చేసి మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదని బెదిరించారు! అంటూ ఓ మహిళ మెగాస్టార్ ఇంటిముందు గొడవకు దిగడం కలకలం రేపింది.

సినిమా పూర్తయ్యాక ఇలా జరగడం బాధించిందని.. అయితే ఇదంతా మధ్యలో ఉన్నవాళ్లే చేస్తున్నారని చరణ్ కానీ మెగాస్టార్ కానీ అలా చేయరని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు మీడియాతో అన్నారు. ఈ వ్యవహారంపై చరణ్ కానీ.. చిరు కానీ స్పందించాల్సి ఉందింకా. సైరా చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer