షాకింగ్: కరోనా రూమ్ మేట్స్ షివరింగ్

0

కరోనా కరోనా స్నేహం చేస్తే.. ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ ఈ ముద్దుగుమ్మల స్నేహం అలానే ఉంది. అది ఈనాటి స్నేహం కాదు. కరోనా పుట్టక ముందునుంచే ఉన్న స్నేహం. కరోనా ముంబైని తాకక ముందే మొలకెత్తిన స్నేహం. ఒకరినొకరు హగ్ చేసుకోకపోతే.. కలిసి షికార్లకు వెళ్లకపోతే ఉండలేనంత గొప్ప స్నేహం. వెకేషన్ కి వెళ్లినా.. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి వెళ్లినా.. లేక అవకాశాల కోసం ఫోటోలు పట్టుకుని ముంబై వీధుల్లో చెప్పులరిగేలా తిరిగినా ఈ ఇద్దరు భామల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఆ బాండింగ్ అంత ధృఢమైనది.

దోస్త్ మేరా దోస్త్ తూహే మేరా జాన్ అంటూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేయడం ఈ ఇద్దరికీ రెగ్యుల్ గా అలవాటే. విదేశీ షికార్లకు వెళ్లడంలోనూ దొందూ దొందే. ఇక రెగ్యులర్ గా రాశి ఖన్నా .. వాణీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని అనుసరించేవారు ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఫోటోలతో ట్రీట్ ని ఆస్వాధించే వీలుంది. ఈ సిరీస్ లోనే తాజా చిత్రం సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. వాణితో స్నేహం ఎలా కుదిరింది రాశీ అని ఒకానొక సందర్భంలో తనని ప్రశ్నిస్తే తను ఏం చెప్పిందో తెలుసా?

“వాణి – నేను దాదాపు ఒక దశాబ్దం కాలంగా స్నేహితులం. దిల్లీలో ఒక టీవీ కమర్షియల్ కోసం ఆడిషన్ చేస్తున్నప్పుడు తనని తొలిసారి కలిసాను. అప్పటి నుండి మేము కలుసుకుంటూనే ఉన్నాం. నిజానికి.. మేము ముంబైలో ఏడాదిన్నర పాటు కలిసి ఉన్నాం. ఆ తరువాత మా స్నేహం మరింత బలపడింది. వాణీ నా కుటుంబ సభ్యురాలితో సమానం“ అని తెలిపింది రాశీ. వాణీ ఇప్పుడు ముంబైలో.. రాశి హైదరాబాద్ లో నివసిస్తున్నా.. కలిసి రెగ్యులర్ గా గాళ్ గ్యాంగ్ యాత్రలకు వెళతాట. సింగపూర్ – దుబాయ్ సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లలో ఇదివరకూ ఈ స్నేహితురాళ్లు కలిసే షికార్ చేశారు.

పాపం ఇటీవల బిజీ షెడ్యూల్స్ వల్ల కలవలేకపోతున్నారట. అప్పుడప్పుడు ముంబైలో మాత్రం కలుసుకుంటున్నారు. ఇక ఏమాత్రం గ్యాప్ దొరికినా.. విహారయాత్ర లు ప్లాన్ చేస్తారట. ఇదంతా ఓకే కానీ రాశీ ప్రస్తుతం ఏఏ సినిమాలు చేస్తోంది అంటే.. వెంకీమామ- ప్రతిరోజూ పండగే చిత్రాలతో హిట్లు కొట్టినా ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపైంది. ప్రస్తుతం సైతాన్ కా బచ్చా- ఆర్మణి 3 అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇవి లాంగ్ పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకనో ఆలస్యం అవుతూనే ఉన్నాయి. మరోవైపు వాణీ కపూర్ అటు వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యశ్రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `షంషేరా`లో నటిస్తోంది. రణబీర్ కపూర్ – సంజయ్ దత్ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Please Read Disclaimer