సెక్సప్పీల్ కాదు ఈ కష్టం చూడండి

0

`ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముంబై టాప్ మోడల్ వాణీ కపూర్. తొలి ప్రయత్నం డిజాస్టర్. ఆ తర్వాత వాణీ అంటే ఎవరో కూడా తెలుగు జనం మర్చిపోయారు. అయితే ఈ అమ్మడిని మాత్రం యశ్ రాజ్ కాంపౌండ్ అస్సలు విడిచి పెట్టలేదు. ఆ కాంపౌండ్ తో చాలా కాలంగా అనుబంధం కొనసాగిస్తున్న ఈ బ్యూటీకి మరో వండర్ ఫుల్ ఛాన్స్ దక్కింది `వార్` రూపంలో. అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి`కి పోటీగా ఈ చిత్రం బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వార్ చిత్రంలోని నటీనటులంతా ప్రచార బరిలో దిగారు. హృతిక్- టైగర్ ష్రాఫ్ ఇప్పటికే ముంబై మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ వేడి పెంచుతున్నారు.

తాజాగా వాణీ కపూర్ ఈ చిత్రంలోని గుంగురో పాట కోసం ఎంతగా శ్రమించింది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. గుంగురో పాటలో వాణీ పోల్ డ్యాన్స్ తో పాటు ఆక్రోబెటిక్స్ కి అద్భుత స్పందన వచ్చింది. ఎంతో బరువైన చక్రం పై ఎంతో బ్యాలెన్స్ చేస్తూ గిరగిరా తిరిగేయడం.. అలాగే స్విమ్మింగ్ పూల్ లో ఓ పోల్ సాయంతో అలా అలా చక్కర్లు కొట్టేయడం ఇవన్నీ చూసేందుకు బాగానే కనిపిస్తాయి. అయితే తేడాలొస్తేనే కిందపడి దెబ్బలు తినాల్సి ఉంటుంది. అందుకే దీనికోసం వాణీ చాలానే శ్రమించిందని అర్థమవుతోంది తాజా వీడియో చూశాక.

ఆక్రోబెటిక్స్ .. క్లిష్ఠమైన డ్యాన్స్ సీక్వెన్సుల కోసం .. స్టంట్స్ కోసం శ్రమించినా అవేవీ గ్లామర్ ఎర ముందు కనిపించకుండా పోతాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా గుంగ్రూ సాంగ్ కోసం పోల్ డ్యాన్స్ చేసిన వాణీ ఎంత శ్రమించిందో స్పష్టంగా కనిపిస్తోంది. భామలంతా అందంగా ఉన్నారా.. సెక్సీనెస్ ఎంత? గ్లామర్ ఎంత ఒలకబోసింది ఇలా కొలతలు కొలుస్తుంటారు. హార్డ్ వర్క్ ని గ్లామరే డామినేట్ చేస్తుంటుంది. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ అందగత్తె మాత్రం తన హార్డ్ వర్క్ తో కమిట్ మెంట్ తో కట్టి పడేస్తోంది. కత్రిన.. దీపిక లాంటి భామలు ఇలా శ్రమించే షార్ప్ అయ్యారు కాబట్టి.. అన్నీ కలిసొస్తే వార్ సక్సెసై వాణీ టైమ్ స్టార్టవుతుందేమో చూడాలి.
Please Read Disclaimer