ఆమెను ప్రేమిస్తున్నానుః వైష్ణవ్ తేజ్

0

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చి.. ట్రేడ్ మార్క్ హిట్ కొట్టాడు వైష్ణవ్ తేజ్. కృతిశెట్టితో కలిసి వైష్ణవ్ సాగించిన లవ్ రొమాన్స్ ను.. అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీకి.. యావత్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఈ చిత్ర విజయంతో డెబ్యూ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు వైష్ణవ్. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు వైష్ణవ్. ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వహించాడు. దీంతో.. ఎంతో మంది ఫ్యాన్స్ తమ డౌట్స్ ను ఎక్స్ ప్రెస్ చేశారు. వాటన్నింటికీ క్లారిటీగా ఆన్సర్ చేశాడీ మెగాహీరో.

మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని అడగ్గా.. రజనీకాంత్ అని చెప్పాడు. ఆయన సినిమాల్లో శివాజీ తనకు చాలా ఇష్టమని ఇప్పటి వరకు చాలా సార్లు ఆ సినిమా చూశానన్నాడు వైష్ణవ్. ఇక తన మొదటి హీరోయిన్ కృతిశెట్టిలో ఉన్న మరో టాలెంట్ ఏంటీ అని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు.

అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి కూడా వెల్లడించాడు వైష్ణవ్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత గిరీశయ్య డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నట్టు చెప్పాడు. వీటి తర్వాత ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్టు తెలిపాడు.

ఇక తనకు బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ అంటే ఇష్టమని గతంలో చెప్పాడు వైష్ణవ్. ఇదే విషయాన్ని తాజాగా రిపీట్ చేశాడో నెటిజన్. మీకు సోనాక్షి అంటే ఎందుకు అంత ఇష్టం? అని అడిగాడు. దీనికి.. ఆమె ఇంటే తనకు ఇష్టం మాత్రమే కాదని ప్రేమ అని చెప్పాడు. ఇప్పటికీ.. తనను ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పాడు.