వకీల్ సాబ్ కి మహమ్మారీ రిలీఫ్ ఇవ్వదా?

0

రీఎంట్రీలో వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు అనుకుంటే ఇలా అయ్యిందేమిటి? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై మహమ్మారీ ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఒకటి కాదు రెండు కాదు.. మూడు నాలుగు సినిమాలు వాయిదాల ఫర్వంలో తెరకెక్కించాల్సిన పరిస్థితి. షెడ్యూల్స్ ఫెయిల్.. కాల్షీట్లు వేస్ట్ అయ్యాయి. అయినా చేసేదేం ఉంది? మహమ్మారీ ఏం చెబితే అదే పవర్ స్టార్ చేయాల్సిన పరిస్థితి ఉంది.ముఖ్యంగా వకీల్ సాబ్ అంటూ రీమేక్ సినిమా తీస్తూ దిల్ రాజు – వేణు శ్రీరామ్ బృందం చిక్కుల్లో పడ్డారు. ఇది ఎప్పటికి పూర్తవ్వాలి? ఎప్పటికి రిలీజ్ చేయాలి? పెండింగ్ అంతంత మాత్రమే అయినా దానికి టైమ్ రావడం లేదు. ఇదంతా ఇలా ఉంటే వకీల్ సాబ్ లేటెస్ట్ ఫోటో అంటూ ఒక ఛాయాచిత్రం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. కానీ ఇందులో ఏదీ కొత్తగా లేదు. ఇంతకుముందే రిలీజైన ఫస్ట్ లుక్ నే మళ్లీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా నటిస్తున్న ఈ మూవీలో లుక్ పై ఇప్పటికే క్లారిటీ ఉంది. తాజా ఫోటోని లీక్డ్ ఫోటో అని చెబుతున్నా.. ఇందులో ఏ కొత్త విషయాన్ని ఓపెన్ చేయకపోవడం విశేషం. పాతదే కొత్తగా చూపిస్తున్నారంతే. టైటిల్ సహా పవన్ స్మార్ట్ అప్పియరెన్స్ కాస్తంత క్లోజప్ లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో అంజలి- నివేదా థామస్- అనన్య – నరేష్- ప్రకాష్ రాజ్- అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆర్టిస్టుల వివరాల్ని దిల్ రాజు వెల్లడించాల్సి ఉంది. మేలో రావాల్సిన ఈ చిత్రం దసరా వరకూ వాయిదా పడినట్టేనని భావిస్తున్నారు. దేనికైనా మహమ్మారీనే సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుందేమో!
Please Read Disclaimer