శ్రీమతితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ‘వకీల్ సాబ్’ నిర్మాత!

0

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత నెలలో నిజామాబాద్లోని ఫార్మ్ హౌస్లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది కూడా వాళ్ల బంధువుల అమ్మాయినే. ఆమె పేరు తేజస్విని. ఈమె ఎయిర్హోస్టెస్గా పనిచేసిందట. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడని.. కూతురు హన్షిత చలవతో జీవితంలో తనకు ఓ తోడు కావాలని భావించిన ఆయన రెండో పెళ్ళి చేసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దిల్ రాజు.. ఇన్నిరోజులు కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి పట్టునే ఉన్నారు. అయితే తాజాగా ఈ నవ దంపతులు లాక్ డౌన్ సడలింపులు లభించడంతో తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు.శనివారం ఉదయం దిల్ రాజు ఆయన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారట. ప్రస్తుతం వారిద్దరూ తిరుమలలో ప్రత్యక్షమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నవ దంపతులకు సోషల్ మీడియా వేదికగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.. సినీ ప్రముఖులు తిరుమల స్వామిని దర్శించుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమా నిర్మిస్తున్నాడు.

అంతేగాక ఇదివరకే నిర్మించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘వి’ కూడా లైన్లో ఉంది. వి సినిమాలో నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్స్ మొదలయ్యాయి. మరి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అయితే ఈ రెండు విడుదల చేద్దామని చూస్తున్నారట దిల్ రాజు.
Please Read Disclaimer