ఆ ప్రొడ్యూసర్ నన్ను పక్కలోకి రమ్మన్నాడు

0

ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ వెలుగుల లోకం. ఆ వెలుగు వెనుకే చీకటీ ఉంది. ఆ చీకటి పేరు క్యాస్టింగ్ కౌచ్. కమిట్మెంట్ అని కూడా పిలుస్తారు. తెలుగు లో చెప్పుకోవాలంటే… సినిమా ఛాన్సు ఇచ్చినందుకు పక్కఎక్కడం. ఇప్పటి బిగ్ హీరోయిన్లలో కొందరు తొలినాళ్ల లో కాస్టింగ్ కౌచ్ బాధితులేనని అంటుంటారు. కానీ ఇది చీకటి వ్యవహారం. ఎవరూ నోరు విప్పి ఏదీ చెప్పరు. దీనికి మినహాయింపుగా అప్పుడప్పుడు ఎవరో ఒకరు గొంతెత్తుతుంటారు. కల్కీ కొచ్చిన్ సుర్వీన్ చావ్లా కంగనా రనౌత్ లాంటి వాళ్లు తమకెదురైన చేదు అనుభవాలను ధైర్యంగా లోకానికి చాటారు. మీటూ ఉద్యమం ఊపు లో ఉన్నప్పుడు కూడా సినీ రంగపు చీకటి బాగోతాలను చాలామంది బయటపెట్టారు. శ్రీరెడ్డి కూడా అప్పట్లో బాగానే ఫైట్ చేసింది. ప్రస్తుతం తన బాధ చెప్పుకుంటున్న హీరోయిన్ వాణీ భోజన్. ఆమెకు మూవీ ఆఫర్ ఇవ్వడానికి ఓ ప్రొడ్యూసర్ తన బెడ్రూమ్కు రమ్మన్నాడట. ఆమే స్వయంగా ఈ విషాయాన్ని వెల్లడించింది. తనను సెక్సువల్ ఆఫర్ అడిగిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం లీక్ చేయలేదు. కనీసం క్లూ కూడా ఇవ్వలేదు. ఆమెపై మోజుపడ్డ ఆ ప్రొడ్యూసర్ ఎవరా అని జనం ఇప్పుడు బుర్రలు బాదుకుంటున్నారు.

వాణీ భోజన్.. మనకూ పరిచయమైన ముఖమే. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన “మీకు మాత్రమే చెప్తా” సినిమా లో హీరోయిన్గా చేసింది. సినిమాలకు ముందు ఈ అమ్మడు సీరియళ్ల లో నటింటింది. దైవమగల్ సీరియల్ లో సత్య పాత్ర వాణీ భోజన్కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. ఆ పాపులారిటీనే ఈ ముద్దుగుమ్మను వెండితెరపైకి లాక్కొచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-