వాణి గ్లామర్ వార్..

0

బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూపులు చూసిన ఫలితం రీసెంట్ గా ‘వార్’ తో దక్కింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ -టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో వాణి ఫుల్ జోష్ లో ఉంది. వాణి మొదటి నుంచి బోల్డ్ కాబట్టి సోషల్ మీడియాను ఆడుకోవడం తనకు కొట్టిన పిండే.

రీసెంట్ గా వాణి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోకండి.. ఎవరూ సజీవంగా ఈ లోకం నుంచి నిష్క్రమించలేరు’ అంటూ ఒక కిరాక్ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే కదా.. మనం ఎంత గింజుకున్నా ప్రాణాలతో ఈ లోకం నుంచి బయటకు పోలేం. అయినా ఇంత హాటు భామ అంత డీప్ ఫిలాసఫీ ఎందుకు చెప్పిందో ఏంటో మరి. ఫోటోలో వాణి డ్రెస్ విషయానికి వస్తే ఏవో అక్షరాలు ఉండే వైట్ కలర్ టాప్.. దానికి మ్యాచింగ్ గా లైట్ బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించింది. హిట్ తీసుకొచ్చిన ఉత్సాహం అంతా ఆ నవ్వులో కనిపిస్తోంది. హాటు భామ కావడంతో అందాలు ధారపోస్తూనే.. తనకేమీ తెలియనట్టు నంగనాచిలా ప్రవర్తిస్తోంది.

ఈ ఫోటోకు సూపర్ కామెంట్స్ వచ్చాయి. ‘సూపర్ హాట్ బేబ్’.. ‘గ్లామర్ వార్ ఎవరిపైన?’.. ‘ఝకాస్ స్మైల్.. సూపర్ స్టైల్’ అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ కు క్యాప్షన్ పెద్ద నచ్చినట్టు లేదు.. అందుకే ఆ రాగం ఏంటి ఈ తాళం ఏంటి అన్నట్టుగా ‘క్యాప్షన్ కి.. ఫోటోకి సంబంధం ఏంటి?’ అని ప్రశ్నించాడు. వాణి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘షంషేరా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.