స్టార్ లేడీ విలన్ సినిమా.. త్వరలో నేరుగా ‘ఓటిటి’లోకి..!

0

తెలుగు సినిమాలలో లేడీ విలన్స్ అంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మన సినిమాలలో ఎక్కువగా హీరోలకు ధీటుగా నిలబడేది మగ విలన్స్ మాత్రమే. లేడీ విలన్స్ పాత్రలకు స్కోప్ ఉన్నా కూడా చాలా సాధారణ స్థాయిలో ఉంటాయి. అయితే పవర్ ఫుల్ లేడీ విలన్స్ మాత్రం తెలుగు సినిమాలలో చెప్పుకోవడానికి ఇంతవరకు ఎవరు లేరని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ లోటుని నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి భర్తీ చేస్తుంది. అటు హీరోయిన్ గా చేస్తూనే.. ఇటు విలనిజం అంటే మగవాళ్ళు మాత్రమే పండించాలనే ఆలోచనల నుంచి దర్శకులని బయటకి తీసుకొచ్చి ఆడవాళ్ళతో కూడా పవర్ ఫుల్ విలనిజం చూపించవచ్చని ఈమె చేసిన పాత్రలతో ప్రూవ్ చేసింది. తమిళంలో పందెంకోడి విజయ్ సర్కార్ మూవీలలో వరలక్ష్మి పండించిన విలనిజంకి చాలా మంది ప్రశంసలు లభించాయి. అయితే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మాత్రం విలన్ గానే ఎక్కువ సుపరిచితురాలు. ప్రస్తుతం వరలక్ష్మి చేతినిండా సినిమాలతో బిజీగా ఉందట. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా త్వరలో నేరుగా ఓటిటిలో విడుదల కానుందట.

వరలక్ష్మి విలన్ గా మెప్పించినప్పటి నుండి ఎక్కువగా లేడీ విలన్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో విలనిజం పండించిన వరలక్ష్మి ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమాలో కూడా తన పవర్ ఫుల్ విలనిజం చూపించడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా ఆమె తాజాగా నటించిన తమిళ సినిమా ‘డాన్నీ’. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పోస్టర్ చూస్తే ఏదో ఆసక్తికరమైన అంశం ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ‘డాన్నీ’ సినిమాను ముత్తయ్య నిర్మించగా.. సంతాన మూర్తి దర్శకత్వం చేశారు. ఇక సంతోష్ దయానిధి సంగీతం అందించారు. ఇటీవలే కీర్తి సురేష్ పెంగ్విన్.. జ్యోతిక పోంమగళ్ వందాల్ సినిమాలో ఓటిటిలో విడుదల అయ్యాయి. ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదల చేసేందుకు తమిళ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Please Read Disclaimer