కరోనా డ్యాన్స్: పోలీసులపై వర్మ పంచులు వైరల్

0

కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ లు ప్రెస్ మీట్లు వీడియో సందేశాలు ఇచ్చారు. ఇక ఫోన్ కాలర్ ట్యూన్ గా దగ్గుతున్న ఆడియో సందేశం పంపారు. అంతవరకు ఓకే కానీ.. తాజాగా ఏపీలోని పార్వతీపురం పోలీసులు కరోనా వ్యాప్తిపై చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. సినిమా పాటపై చేతులు కడుక్కోవాలని.. షేక్ హ్యాండ్స్ ఇవ్వరాదని వారు చేసిన డ్యాన్సులపై విమర్శలు చెలరేగాయి.

ఇలాంటి వాటిని చూసి అబ్బో పోలీసులతో మనకెందుకులే అని అందరూ ఊరుకుంటారు. కానీ వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఊరుకుంటాడా? దాన్ని ట్విట్టర్ లో షేర్ చేసి పోలీసులనే చెడుగుడు ఆడేశారు. పోలీసుల తీరును ట్విట్టర్ లో ఎండగట్టి విమర్శలు గుప్పించాడు.

తాజాగా రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. పోలీసులు ముసుగులు చేతి తొడుగులు ధరించి పరిశ్రుభతను పాటించాలని డ్యాన్స్ రూపంలో సినిమా పాటలో ఎగిరి గంతులేశారు. దాన్ని వర్మ షేర్ చేశారు.

అయితే ఈ ప్రయత్నం అభినందించదగినదే అయినా పోలీసులు సినిమా పాటకు డ్యాన్స్ లు వేయడం హాస్యాస్పదం అయ్యింది. వీడియో చూసిన వారితో పాటు రాంగోపాల్ వర్మ కూడా ఇదే సెటైర్ వేశారు.

రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ‘కరోనా భయంతో కష్టకాలంలో ఉన్న వారికి పోలీసులు బలాన్ని ఇవ్వాలని.. కానీ మీరిలా డ్యాన్సులు చేసి కామెడీ పండించారని.. ఈ రకమైన సంపూర్ణేష్ బాబు బాఫూన్స్ కామెడీని ఆపాలంటూ’ పోలీసులను రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ఈ వీడియో కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

The police themselves might not know it but public like me look upto the police and I request them not to do this Sampoornesh Babu kind of buffoonery ..I want to feel the police strength in the corona times and not to appear like a joke
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-