వర్మ ఇస్మార్ట్ పార్టీపై సూపర్ స్టార్ రియాక్షన్

0

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విషయంలో వర్మ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన వర్మ ఏ స్థాయిలో రెచ్చి పోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షాంపైన్ బాటిల్స్ ను పొంగిస్తూ తనపై తాను పోసుకోవడంతో పాటు.. హీరోయిన్స్ పై మరియు పూరి ఇంకా ఛార్మిపై కూడా గుమ్మరించాడు. ఈ నైట్ పార్టీ వీడియోను స్వయంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

నేనేం పిచ్చోడిని కాదు.. నన్ను ఇస్మార్ట్ శంకర్ పిచ్చోడిని చేశాడంటూ వర్మ చేసిన పోస్ట్ పై తెగ ట్రోల్స్ పడ్డాయి. తనను ఎందరు ఎలా ట్రోల్స్ చేసినా పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ తనపై తానే పంచ్ లు వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తన నైట్ పార్టీ వీడియోను చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ రియాక్షన్ అంటూ చంద్రముఖి సినిమాలోని సీన్ ను పోస్ట్ చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.

మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్ ను వర్మ తనదైన శైలిలో దుమ్ము రేపుతూ చేస్తున్నాడు. వర్మ చేస్తున్న ఈ ప్రమోషన్ తో సినిమా గురించి జనాలు చర్చించుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పూరి చాలా కాలం తర్వాత సక్సెస్ ను కొట్టాడంటూ అంతా అంటున్నారు. ఇక రామ్ అద్బుతమైన ఎనర్జితో ఈ చిత్రంలోని శంకర్ పాత్రను పోషించి మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్స్ స్కిన్ షో తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
Please Read Disclaimer