వరుణ్ సాయంతో తన కల నెరవేర్చుకున్న వితిక

0

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 లో వరుణ్ వితికల జంట ప్రత్యేక ఆకర్షణ. భార్యాభర్తలు బిగ్‌బాస్ ఇంట్లోకి వస్తున్నారు అన్నప్పటి నుండి ఈ ఇద్దరిపై అందరి దృష్టి పడింది. కాగా బిగ్‌బాస్ ఇంట్లో వితిక చిన్నపిల్లలాగా ప్రవర్తించినా కూడా వరుణ్ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా వితికను కూడా చాలా కూల్‌గా డీల్ చేస్తాడు. మొదట్లో ప్రతివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వితిక ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచింది.

తాజాగా ఎనమిదో వారం కెప్టెన్సీ పోటీదారులుగా వితిక శ్రీముఖి మహేష్‌లు నిలిచారు. ఎలిమినేట్ అయ్యి పోయే ముందు ఒక్కసారైనా బిగ్‌బాస్ ఇంటికి కెప్టెన్ అవాలని వితిక చాలా ఆశపడింది. వితిక కల నెరవేర్చేందుకు వరుణ్ చాలా కష్టపడి ఆమెను కెప్టెన్‌గా గెలిపించాడు. బరువు ఎత్తడం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా వితిక రాహుల్ సాయం తీసుకుందామనుకుంది. కానీ వరుణ్ తానే స్వయంగా వితికకు సాయం చేస్తానని కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నాడు. పునర్నవి కూడా వితికని గెలిపించడానికి వరుణ్‌నే కరెక్ట్ అని సలహా ఇచ్చింది. వితికను ఎత్తుకుని 22 జెండాలు పెట్టించాడు వరుణ్. అందరికంటే ఎక్కువ జెండాలను పెట్టడంతో వీటిక కెప్టెన్ అయ్యింది.

కెప్టెన్ అయినపుడు వితిక సంతోషం అంతా ఇంతా కాదు. నేను కెప్టెన్ అయ్యానోచ్ అంటూ గంతులేసింది. వితిక కెప్టెన్ అయినందుకు వరుణ్ రాహుల్ పునర్నవిలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయినందుకుగాను శ్రీముఖి చాలా నిరాశను వ్యక్తం చేసింది. మొత్తానికి కెప్టెన్ అవాలని ఎప్పటి నుండో కలంటున్న వితిక వరుణ్ సాయంతో తన కలను నెరవేర్చుకుంది.
Please Read Disclaimer