కరోనా ఎఫెక్ట్ : ఇద్దరు హీరోల పెళ్లిళ్లు వాయిదా

0

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు – అనుమానిత కేసులు పెరిగిపోవడంతో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే వ్యాపారాలపైనా కరోనా ప్రభావం పడింది… ముఖ్యంగా ఫౌల్ట్రీ రంగంకు తేరుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం పెళ్లిళ్ల పైనా పడింది. విదేశాల్లో ఉంటూ వివాహాలు నిశ్చయం చేసుకున్న వారు స్వదేశాలకు రాలేక వాయిదా వేసుకుంటున్నారు.

వీటిలో వరుణ్ ధావన్ – నటాషా దలాల్ – రిచా చద్దా – అలీ ఫజల్ జంటల వివాహాల గురించి చెప్పుకోవాలి. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఇద్దరు ప్రముఖుల వివాహం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ ను పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో వివాహం చేసుకున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా తమ పెళ్లిని నవంబర్ కి వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించించారు. మరోవైపు 2015 నుండి డేటింగ్ చేస్తున్న రిచా చద్దా – అలీ ఫజల్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకటి కావాలని నిచ్ఛయించుకున్నారు. కానీ పెళ్ళికి విదేశాల నుండి అతిథులను ఆహ్వానించిన నేపథ్యంలో పెళ్లి వాయిదా వేయవలసి వచ్చిందని – కరోనా వైరస్ ప్రభావం తర్వాత తదుపరి తేదీలను నిర్ణయించుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేసారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-