ఫొటోతో ప్రస్తుత పరిస్థితిపై మెగా ఫన్నీ కామెంట్

0

మహమ్మారి వైరస్ కారణంగా ఈ ఏడాది మొత్తం కూడా గందరగోళంగా అస్థవ్యస్థంగా మారిన విషయం తెల్సిందే. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో దీని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో సామాన్య ప్రేక్షకుడిని అడిగినా తెలుస్తుంది. హీరోలు ఈ ఏడాదిలో సినిమాలను ప్లాన్ చేసుకోవడం కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం వంటివి ఎన్నో చేశారు. కాని సంవత్సరం ఆరంభం నుండే పరిస్థితి తలకిందులు అయ్యింది. మార్చి నుండి ఇప్పటి వరకు కూడా హీరోలు కెమెరా ముందుకు రాలేదు. షూటింగ్స్ కు ఇటీవలే అనుమతులు ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ ఈ పోస్ట్ పెట్టాడు. 2020 సంవత్సరంలో ప్లాన్స్ అన్ని కూడా ఈ ఫొటో మాదిరిగా బ్లర్ అయ్యాయి. ఎన్నో అనుకుంటే ఈ ఏడాది ఏమీ జరిగే పరిస్థితి లేదు అన్నట్లుగా వరుణ్ తేజ్ పోస్ట్ చేశాడు. ఫొటోలో వరుణ్ బ్లర్ గా కనిపిస్తూ పింక్ కలర్ టింట్ తో మొత్తం పిక్చర్ క్లీయర్ గా లేదు. అలాగే ఈ 2020 సంవత్సరం ఉన్నట్లుగా ఉన్నా కూడా ఏమీ క్లారిటీ లేదు అనేది వరుణ్ తేజ్ అభిప్రాయం.

వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా సగం అయ్యిందని తెలుస్తోంది. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నాడు. గద్దలకొండ గణేష్ వంటి హిట్ తర్వాత వరుణ్ చేస్తున్న ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి ఉంది. ఈ ఏడాది సమ్మర్ సీజన్ తర్వాత సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.
Please Read Disclaimer