శ్రీముఖి సేవ్ అయింది..ఆ ముగ్గురిలో మూడిందెవరికో?

0

ప్రేక్షకులు అనుకున్న విధంగానే బిగ్ బాస్ లో నామినేషన్ నుంచి కంటెస్టంట్స్ సేఫ్ అవుతూ వస్తున్నారు. గత సోమవారం – మంగళవారం ఎపిసోడ్ లలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో రాహుల్ గెలిచి డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5 కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన ఐదుగురు నామినేట్ అయ్యారు. అయితే ఎవరు ఊహించని విధంగా శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేశారు. రాత్రి 3:30 గంటలకు నామినేషన్ లో ఉన్నవారిని నిద్రలేపి…బాబా భాస్కర్ ని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా టాప్-5కి పంపారని ప్రకటించారు.దీంతో బాబా కూడా టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు.

ఇక మిగిలిన నలుగురులో శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఒకరిని సేవ్ చేశారు. మొదట బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన నాగ్….ముందు రోజు హౌస్ లో ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు. ఆ తర్వాత వారికి క్లాస్ తీసుకున్నారు. అలాగే ఓ టాస్క్ కూడా ఆడించారు. వీటి తర్వాత నాగ్…నామినేషన్ లో ఉన్న శివజ్యోతి – శ్రీముఖి – వరుణ్ – అలీల్లో ఒకరిని సేఫ్ చేసే కార్యక్రమం చేశారు. ప్రేక్షకుల ఓటింగ్ తో శ్రీముఖి సేవ్ అయిందని చెప్పి – ఆమె టాప్-5కు చేరుకుందని చెప్పారు.ఇక మిగిలిన ముగ్గురు భవితవ్యం ఆదివారం ఎపిసోడ్లో తేలనుంది. వరుణ్ – శివజ్యోతి – అలీల్లో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఖాయమైంది. అయితే ఇప్పటివరకు ప్రేక్షకుల అనుకున్న విధంగానే మొదట బాబా – తర్వాత శ్రీముఖి సేఫ్ అయింది. నెక్స్ట్ వరుణ్ సేవ్ అవుతాడని అనుకుంటున్నారు. కాబట్టి ఆదివారం ఎపిసోడ్ లో వరుణ్ సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శివజ్యోతి – అలీ ల్లో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
Please Read Disclaimer