బిగ్ బాస్ 3లో బంగారు హీరో

0

వచ్చే వారం 21 నుంచి బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో మొదలుకానుంది . యాంకర్ విషయంలో కొంత ఆలస్యం జరగడంతో తమిళ్ కన్నా చాలా లేట్ గా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. వంద రోజుల పాటు జరిగే ఈ ఇన్ హౌస్ రియాలిటీ షోలో మొత్తం 15 పార్టీసిపెంట్స్ ఉండబోతున్నారు. ఎవరు అనే లిస్ట్ అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లలో తొంభై శాతం నిజమే అని సమాచారం.

ఇదిలా ఉండగా దీంట్లో హీరో వరుణ్ సందేశ్ ఉండబోతున్నాడన్న కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. హ్యాపీ డేస్ తో పరిచయమై కొత్త బంగారు లోకం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. హిట్లు సింగల్ డిజిట్ లో ఉంటే ఫ్లాపులు డబుల్ డిజిట్ దాటేశాయి దీంతో పరిశ్రమకు త్వరగానే దూరమైన వరుణ్ సందేశ్ యుఎస్ లో సెటిలైపోయాడు. అక్కడే ఫామిలీతో సహా స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు.

ఇటీవలే నువ్వు తోపు రా అనే సినిమాలో తానున్న చోటే షూటింగ్ జరగడంతో ఓ పాత్ర పోషించాడు కానీ అది డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడీ బిగ్ బాస్ 3 ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెబ్ సిరీస్ లు చేసినా రాని పేరు దీంతో అయినా వస్తుందేమో చూడాలి. సినిమా చేయకపోయినా ప్రేక్షకులకు గుర్తున్న వరుణ్ సందేశ్ కు బిగ్ బాస్ 3 ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి
Please Read Disclaimer