మెర్రీ క్రిస్మస్ తో అన్నా చెల్లెళ్ల మెగానుబంధం

0

ప్రిన్సెస్ నీహారిక మెగా ఫ్యామిలీ గారాల పట్టీ అన్న సంగతి తెలిసిందే. ఆ ఫ్యామిలీలో అందరికంటే వయసులో చిన్నది. అందుకే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ నిహారిక అంటే ఎంతో ప్రత్యేక అభిమానం .. ఆప్యాయత. నిహారికపై చిరంజీవి.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయతానురాగాల్ని కురిపిస్తారు. చెల్లెలిపై అన్నలు రామ్ చరణ్.. వరుణ్ తేజ్ చూపించే ప్రేమ వర్ణించలేనిది. వాళ్లందరితో నిహారిక ఇంట్లో ఎంత ఆప్యాయంగా మెలుగుతుందో పలు సందర్భాల్లో రివీలైన వీడియోలు చెప్పకనే చెప్పాయి. నిహారిక పుట్టిన రోజు డిసెంబర్ 18న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య వరుణ్ తేజ్ శుభాకాంక్షలు చెబుతోన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇదే నెల 25న క్రిస్మస్ వస్తోన్న నేపథ్యంలో నిహారిక బర్త్ డే క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నయ్యతో నీహారిక అనుబంధానికి ప్రేమకు సూచికగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో రివీలయ్యాయి. తనకు ప్రత్యేకంగా విషెస్ చెప్పిన అన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. “నువ్వు నా రాక్. నీతో ఉన్న ప్రతీ పుట్టిన రోజు నాకు ప్రత్యేకమే“ అంటూ నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మరి చెల్లెలికి అన్నయ్య బర్త్ డే గిప్పు ఏమిచ్చాడాన్నది మాత్రం రివీల్ చేయలేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నిహారిక కెరీర్ ఆశించినంత స్పీడ్ తో సాగలేదు. ఇటీవల సైరా నరసింహారెడ్డి లో గిరిజన అమ్మాయి గా తళుక్కున మెరిసింది. అంతకు ముందు మూడు నాలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా బిగ్ బ్రేక్ రాలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.
Please Read Disclaimer