వామ్మోవ్! మెగా ప్రిన్ సెస్ స్కైలో తేలిందే!

0

అన్నా చెల్లెళ్లు ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ మామూలుగా లేదుగా? మెగా ఫ్యాన్స్ కి ఇంత పెద్ద షాకిస్తారని అనుకోలేదు. ఉన్నట్టుండి అన్న చెల్లి కలిసి ఇంత డేరింగ్ గా స్కైవాకింగ్ చేస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రాకెట్లు ప్రయాణించేంత ఎత్తైన చోట ఇలాంటి సాహసాలు చేస్తారా? వామ్మోవ్.. ఎన్ని గుండెలు మీకు? ఇంత డేరింగ్ మెగా బ్రదర్ అండ్ మెగా సిస్టర్ ని చూస్తుంటే భయం వేయడం లేదూ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల మకోవో టూర్ వెళ్లారు. అక్కడ జపనీ పర్యాటకులతో కలిసి స్కై వాకర్స్ గా మారిపోయారు. గాల్లో తేలి అలా అలా వెళుతుంటే ఆ మజాని ఆస్వాధించారు. పైనుంచి ఒకసారి కిందికి చూస్తే వాళ్లకు కాదు కానీ.. ఆ దృశ్యం చూస్తున్న వాళ్లకే ఒళ్లు ఝల్లంటోంది. జివ్వుమని నరాలు లాగేస్తున్నాయి. అయ్యబాబోయ్ .. ఇంత ధైర్యమా? అని కంగారు పడిపోవాలంతే. అసలు నీహారిక ముఖంలో ఎక్కడా భయం జాడైనా కనిపించలేదాయె!

అయితే అంత ఎత్తున ఆ సాహసాన్ని వీడియోగా తీసి చూపించేందుకు నీహారిక అండ్ ఫ్రెండ్స్ బృందం ప్రయత్నించినా అది పూర్తి క్లారిటీగా రాలేదు. స్కైవాకర్స్.. బంగీ జంప్ లాంటి సాహసాలు చేయడం అంటే గుండెల్లో కాస్తంత గట్ ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ ఈ అన్నా చెల్లెళ్లకు ఉందని అంగీకరించి తీరాలి. వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి చిత్రంలో నటిస్తున్నారు. నీహారికి కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్ తెలియాల్సి ఉందింకా. ఈ లోగానే ఖాళీ సమయాల్లో ఈ ఎంజాయ్ ట్రిప్ ని ఆస్వాధిస్తున్నారు.
Please Read Disclaimer