మెగా హీరోకి భలే కలిసొచ్చింది!

0

ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా రెండు ఘన విజయాలను జేబులో వేసుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఏడాది ఆరంభంలో వెంకీ తో కలిసి ‘F2’ చేసిన వరుణ్ ఎవరూ ఊహించని విధంగా మంచి సక్సెస్ అందుకున్నాడు. సినిమా విజయంలో వెంకీ తర్వాత కీలక పాత్ర వరుణ్ కే దక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ‘గద్దల కొండ గణేష్’ గా మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చాడు.

భారీ అంచనాల నాడు విడుదలైన ‘గద్దల కొండ గణేష్’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాదించి సూపర్ హిట్ అనిపించుకుంది. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు – డిస్ట్రి బ్యూటర్స్ మంచి లాభాలు చవిచూశారు కూడా. అయితే ఈ ఏడాది మిగతా హీరోలు రెండు సినిమాలతో వచ్చినా వరుణ్ లా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ మాత్రం అందుకోలేకపోయారు. అందుకే ఈ ఏడాది ఈ మెగా హీరోకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరి నెక్స్ట్ ఇయర్ కూడా వరుణ్ ఇదే ట్రాక్ కంటిన్యూ చేస్తే తన మార్కెట్ మరింత పెరగడం ఖాయం.
Please Read Disclaimer