త్రీ మంత్స్ లో బాక్సర్ గా తిరిగొస్తాడట

0

‘F2’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు . ‘అంతరిక్షం’ ఫలితానికి నిరాశపడినప్పటికీ ఒక్క నెల గ్యాప్ లోనే తను నటించిన మరో సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తున్నాడు.

తన నెక్స్ట్ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీతో స్వయంగా నిర్మించేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాకోసం ఫిట్నెస్ ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడట. ‘చిత్రలహరి’ ప్రారంభం కాకమునుపు సాయి ధరమ్ అమెరికాకు వెళ్ళి మూడు నెలల పాటు తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ కూడా అదే బాటలో పయనిస్తూ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకుంటాడట. ఒక రియల్ బాక్సర్ తరహాలో కండలు పెంచుతాడట.

ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు బాకింగ్ కోచ్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తాడని సమాచారం. ‘అంతరిక్షం’ లాంటి స్పేస్ థ్రిల్లర్.. ‘F2’ లాంటి వైఫ్ టార్చర్ జోనర్లలో సినిమాలు చేసిన వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్ జోనర్ లో సినిమా చేయడం విశేషం. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకొని ముందుకు సాగిపోతున్నాడు వరుణ్ తేజ్.
Please Read Disclaimer