మేజిక్ రిపీట్ చేస్తాడా ?

0

టాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. అయితే టాలీవుడ్ లో రీమేక్ సినిమాల్లో బెంచ్ మార్క్ మాత్రం ‘గబ్బర్ సింగ్’. ఇది అందరికీ తెలిసిందే. హిందీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ట్రాక్ లో తీసుకొచ్చి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ ఇన్నేళ్ళకి మళ్ళీ ఓ రీమేక్ సినిమాను హ్యాండిల్ చేస్తున్నాడు.

తమిళ్ లో తెరకెక్కిన ‘జిగార్తాండ’ ను తెలుగులో వాల్మీకి టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. అందులో బాబీ సిన్హా పాత్రను తెలుగులో వరుణ్ ను చేయిస్తున్నాడు. సిద్దార్థ్ పాత్ర కోసం అధర్వను తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. కాకపోతే సిద్దార్థ్ నటించిన ఈ సినిమాను అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. తమిళ్ లో మాత్రం పెద్ద హిట్టైంది.

అందుకే ఏరి కోరి మరి ఇప్పుడు హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. అయితే తమిళ్ వర్షన్ తో పోలిస్తే హరీష్ ఇందులో చాలానే మార్పులు చేసాడని తెలుస్తుంది. ఒరిజినల్ కంటెంట్ ను పక్కన పెట్టి మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో హరీష్ మాస్టర్. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి అంటూ తీసిన కామెడీ సీన్ థియేటర్స్ లో బాగా పేలింది. సినిమా విజయంలో కూడా ఆ కామెడీ ట్రాక్ చాలా కీ లక పాత్ర పోషించింది. మరి మళ్ళీ హరీష్ అదే మేజిక్ రిపీట్ చేస్తాడా..చూడాలి.
Please Read Disclaimer