చెల్లి నిశ్చితార్థం తర్వాత రింగ్ లోకి వరుణ్

0

కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి. కొన్ని చిన్నా చితకా సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నప్పటికి ఒక మోస్తరు హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఎవరు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్లలేదు. బతికి ఉంటే ఆ తర్వాత ఏడాదికి రెండు మూడు సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బతికే ఉందా బయటకు వెళ్లకుండా అంటూ కొందరు హీరోలు కనీసం అడుగు బయట కూడా పెట్టడం లేదు. ఇలాంటి సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.

యంగ్ హీరోలు కొందరు జులై ఆగస్టు నుండి షూటింగ్స్ కు వెళ్లాలనుకున్నారు. కాని జులైలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ సమయంలో బయటకు వెళ్లేందుకు వారు ముందడుగు వేయలేక పోయారు. ఇక వచ్చే నెలలో కూడా కొందరు హీరోలు ముందుకు రావాలనుకుంటున్నారు కాని పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంపై క్లారిటీ లేదు. పరిస్థితి ఎలా ఉన్నా కూడా వరుణ్ మాత్రం వైజాగ్ లో తన బాక్సింగ్ చిత్రం షూటింగ్ కు హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడు. వచ్చే నెలలో చెల్లి నిహారిక నిశ్చితార్థం ఉండనుందట. ఆ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే వరుణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.

అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ మరియు సిద్దు ముద్దా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటించబోతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అంతర్జాతీయ బాక్సింగ్ మాజీ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో బాక్సింగ్ లో శిక్షణ పొందిన విషయం తెల్సిందే. బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. దాదాపుగా సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.Please Read Disclaimer